కీర్తి సురేష్ తన కెరీర్లో డిఫరెంట్ మార్పే చేసింది. ఇంతవరకు క్యూట్ హీరోయిన్ గా కనిపించిన కీర్తి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాక కీర్తి పూర్తిగా గ్లామరస్ హీరోయినైపోయింది. రీసెంట్ గా బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కీర్తికి ఆ సినిమా పెద్దగా విజయాన్ని ఇవ్వలేకపోయింది. ఇప్పుడు కీర్తి బాలీవుడ్ లో మొదటిసారి డిఫరెంట్ గా, పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. అమ్మడు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేసింది. అక్క అనే వెబ్ సిరీస్‌లో పవర్‌ఫుల్ రోల్ లో కీర్తి కనిపించనుంది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎక్కడా ఎలాంటి క్లూ కానీ, అప్‌డేట్ కానీ ఇవ్వకుండా సడెన్ గా ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేసింది నెట్ ఫ్లిక్స్. నెట్ ఫ్లిక్స్ తాజాగా తమ నుంచి రాబోతున్న కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వగా అందులో కీర్తి సురేష్ అక్క ప్రాజెక్టు కూడా ఒకటిగా ఉంది. అక్క ప్రాజెక్టుని అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ అంటూ ఓ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. ధర్మ రాజ్ శెట్టి ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. గ్లింప్స్ చూస్తుంటే కీర్తి సురేష్ ఈ సిరీస్‌లో నెక్ట్స్ లెవెల్లో మెప్పించడం ఖాయమనిపిస్తుంది. అక్క అనే పవర్ కోసం కీర్తి సురేష్, రాధికా ఆప్టే మధ్య వార్ జరిగేలా ఉంది. అక్క సిరీస్ మొత్తం ఆడ సామ్రాజ్యమే అన్నట్టుగా గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతుంది. గోల్డ్ స్మగ్లింగ్, ఆయుధాల అక్రమ రవాణా ప్రధానంగా తెరకెక్కనున్న ఈ గ్యాంగ్‌స్టర్ సిరీస్ ఎంగేజింగ్ డ్రామాలాగా అనిపిస్తుంది.