Tuesday, April 22, 2025

పవర్‌ కట్‌ హైదరాబాద్‌లో అప్రకటిత విద్యుత్‌ కోత

వేసవిలో విద్యుత్‌ వినియోగం పెరుగడంతో.. అప్రకటిత కోతలను అమల్లో పెడుతున్నారు. ఇటీవల మూడు రోజుల నుంచి మధ్యాహ్నం సమయంలో పవర్‌ సప్లై ఆపేస్తున్నారు. దాదాపుగా 30 నుంచి 50 నిమిషాల వరకు విద్యుత్‌ సరఫరా ఆగిపోతోంది. అసలు తెలంగాణలో విద్యుత్‌ కోతలు లేవని, 15వేల మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని విద్యుత్‌ సంస్థలు ప్రకటిస్తున్నాయి. కానీ, కరెంట్‌ కోతలు మాత్రం పెడుతూనే ఉన్నారు. వరుసగా మూడు రోజుల నుంచి విద్యుత్‌ కోతల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు ప్రస్తావిస్తూ నెటిజన్లు ఎక్స్‌ వేదికగా టీజీఎస్‌పీడీసీఎల్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 24 గంటలు కరెంట్‌ ఇవ్వాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి చెబుతుండగా, హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం సిటీలో కరెంట్‌ కోతలే లేవంటూ ప్రకటిస్తున్నారు. కానీ ఇందుకు విరుద్ధంగా హైదరాబాద్‌లో పవర్‌ కట్స్‌ మొదలయ్యాయి.

నెటిజన్ల ఫైర్‌
ఫిబ్రవరి నుంచి అప్రకటిత కరెంట్‌ కోతలు పెరిగాయంటూ వినియోగదారులు తమ ప్రాంతాలకు కేటాయించిన ఫోన్‌ నంబర్లకు ఎన్ని సార్లు కాల్‌ చేసినా స్పందన లేదని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఆయా ఏరియాల కరెంట్‌ ఆఫీసులకు కాల్‌ చేస్తే అసలు ఎత్తే వారే లేరని, ఒకవేళ కాల్‌ రిసీవ్‌ చేసుకున్నా కరెంట్‌ ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పలేమంటున్నారని కొందరు వినియోగదారులు చెప్పారు. కొన్నిచోట్ల మెయింటెనెన్స్‌ కోసమంటూ ప్రకటించిన కోతలకు సంబంధించిన వాటిపై కంప్లైంట్స్‌ వస్తున్నాయంటూ అధికారులు చెబుతున్నప్పటికీ నెటిజన్లు రాత్రివేళల్లో, మధ్యాహ్నం వేళల్లో అప్రకటిత కోతలకు సంబంధించి పోస్ట్‌ చేస్తున్న ఫొటోలు, వివరాలు స్పష్టంగా ఉంటున్నాయి. హబ్సిగూడ, సైబర్‌సిటీ, మేడ్చల్‌ సర్కిళ్లలో అధిక డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో కోతలు లేకుండా డిమాండ్‌కు తగ్గట్లుగా సప్లై అందించడానికి సమ్మర్‌ ప్లాన్‌ అమలు పరచడంలో ఫెయిలయినట్లుగా వినియోగదారులు చెబుతున్నారు.

నెటిజన్ల ట్వీట్లు ఇలా ఉన్నాయి..
విజయ్‌జైన్‌ అనే నెటిజన్‌ తన ఎక్స్‌ వేదికగా రామంతపూర్‌లో కరెంట్‌కోతలపై పోస్ట్‌ చేశారు. ఎలాంటి ముందస్తు షెడ్యూల్‌ లేకుండా, ప్రకటన లేకుండా రామంతపూర్‌లోని శ్రీనివాసపురం కాలనీ స్ట్రీట్‌నం.2లో పవర్‌కట్‌ ఉందన్నారు. తమ ఏరియాలోనే కరెంట్‌ లేదని పోస్టులో పేర్కొన్నారు. హబ్సిగూడ ఆపరేషన్స్‌ ఎస్‌ఈ స్పందిస్తూ సమస్యను తొందరగా పరిష్కరిస్తామన్నారు. దీనికి సమాధానంగా తమ ప్రాంతంలో కరెంట్‌ పోయిందంటూ ఎలక్ట్రిసిటీ ఆఫీసుకు కాల్‌ చేసినా స్పందించడం లేదన్నారు.
వివేక్‌ షెనాయ్‌ అనే మరో నెటిజన్‌ వెల్‌కమ్‌ పవర్‌ కట్‌ ఇన్‌ హైదరాబాద్‌ అంటూ పోస్ట్‌ చేశారు. సైబర్‌సిటీ, చందానగర్‌లో కరెంట్‌కోతలకు సంబంధించి ఒక మెసేజ్‌ కూడా రావడం లేదని, ఫోన్‌ చేసినా సిబ్బంది నుంచి నిర్లక్ష్యంగా సమాధానం వస్తున్నదన్నారు. శ్రీధర్‌ అనే మరో నెటిజన్‌ వేసవి ప్రారంభంలోనే హైదరాబాద్‌లో పవర్‌ కట్స్‌ ప్రారంభమయ్యాయంటూ మండిపడ్డారు. తార్నాక స్ట్రీట్‌ నంబర్‌ 1లో కరెంట్‌కోతలకు సంబంధించిన ఫొటో షేర్‌ చేస్తూ గంటన్నరకు పైగా కరెంట్‌ పోతున్నదని పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com