Wednesday, December 25, 2024

ఐపిఎస్‌ గా విజయశాంతి పవర్ ఫుల్ ఫస్ట్ గ్లింప్స్

తన కెరీర్ లో పోషించిన అద్భుతమైన ఇంటెన్స్ క్యారెక్టర్స్ తో లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందారు విజయశాంతి. చాలా కాలం తర్వాత ఆమె నందమూరి కళ్యాణ్ రామ్21 చిత్రానికి సైన్ చేశారు. ఇది చాలా అద్భుతమైన స్క్రిప్ట్. ఇందులో కర్తవ్యం తరహాలో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఆమె పాత్రను వైజయంతి ఐపిఎస్‌గా పరిచయం చేసారు.

ఆమె షేడ్స్‌తో ఖాకీ దుస్తుల్లో డాషింగ్ గా కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో అర్థమవుతోంది. మేకర్స్ క్యారెక్టర్ ని పరిచయం చేయడానికి ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. “వైజయంతి ఐపీఎస్… తను పట్టుకుంటే పోలీస్ తుపాకికే ధైర్యం వస్తుంది… వేసుకుంటే యూనిఫాం కే పౌరుషం వస్తుంది… తానే ఒక యుద్ధం… నేనే తన సైన్యం…” అంటూ కళ్యాణ్ రామ్ వాయిస్‌ ఓవర్ తో క్యారెక్టర్ ని ప్రజెంట్ చేయడంతో అదిరిపోయింది. కళ్యాణ్ రామ్ కూడా వీడియోలో ఫెరోషియస్ గా కనిపించారు.

ప్రదీప్ చిలుకూరి రచన, దర్శకత్వం వహిస్తున్న #NKR21 నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా విడుదలైన ది ఫిస్ట్ ఆఫ్ ఫ్రేమ్ గ్లింప్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. గ్లింప్స్ యాక్షన్‌తో అదరగొట్టింది. కళ్యాణ్ రామ్‌ని కొత్త గెటప్‌లో ప్రజెంట్ చేసింది.

#NKR21 అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో బిగ్ స్కేల్ లో జరుగుతోంది. ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. రామ్ ప్రసాద్ డీవోపీ గా పని చేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com