Sunday, June 15, 2025

పవర్‌స్టార్‌ కొత్త మూవీకి గ్రీన్‌సిగ్నల్‌

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పెండింగ్ లో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉన్న ఆయన.. ఇప్పుడు తనను నమ్ముకున్న నిర్మాతలకు, దర్శకులకు టైమ్ కేటాయిస్తున్నారు. లైనప్ లో ఉన్న సినిమాలు ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం హరిహర వీరమల్లు మూవీని పవన్ పూర్తి చేశారు. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ మూవీని ఫినిష్ చేశారు పవన్. త్వరలో డబ్బింగ్ వర్క్ ను కంప్లీట్ చేయనున్నారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఫోకస్ పెట్టారు. అయితే వరుస సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న పవన్.. స్పెషల్ డైట్ ను ఫాలో అవుతున్నట్లు సమాచారం. దీంతో 10 కిలోల బరువు తగ్గారని తెలుస్తోంది. కేవలం ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తున్నారట. మిగతా సమయాల్లో స్నాక్స్, బ్లాక్ కాఫీ తీసుకుంటున్నారని టాక్. ఎక్సర్ సైజెస్ కూడా చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి సీక్రెట్ డైట్ ఫాలో అవుతున్నారు పవన్. పవర్ స్టార్ ఆయన అభిమానులకు మరో తీపి కబురు అందించనున్నట్టు టాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. మూవీ సర్కిల్స్ లో నడుస్తున్న టాక్ ప్రకారం.. పవన్ కళ్యాణ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ విషయం ఫుల్ హాట్ టాపిక్ గా మారింది. సముద్రఖని డైరెక్షన్ లోనే మరో సినిమా చేసేందుకు పవన్ ఒకే చెప్పారని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com