ఫోన్ ట్యాపింగ్ కేసుపై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు.. గురువారం ప్రకటించనుంది. ఛార్జ్‌షీట్ వేయకపోవడంతో డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని మాజీ అడిషనల్ ఎస్పీలు కోరగా.. జూన్ 10నే ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని పీపీ కోర్టు స్పష్టం చేశారు. కొన్ని కారణాలతో ఛార్జ్‌షీట్‌ను వెనక్కి పంపారని పీపీ వాదించారు. బెంచ్ మీద ఛార్జ్‌షీట్ లేదు కాబట్టే.. డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశామని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా.. పలు సుప్రీంకోర్టు తీర్పులను ఇరుపక్షాలు ప్రస్తావించాయి. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసింది నాంపల్లి కోర్టు. బుధవారం తీర్పు వెలువడనుంది.
ప్రభాకర్ రావు కోసం వెయిటింగ్
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు బుధవారం భారత్‌కి తిరిగి రావాల్సి ఉంది. విదేశాల్లో ఉన్న ఆయన వీసా గడువు బుధశారంతో ముగిసింది. దీంతో ఆయన భారత్‌కి తిరిగి రావాల్సి ఉంది. ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టిన వెంటనే సిట్ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే అనారోగ్యం కారణంగా వీసా గడువును మరికొంత కాలం పెంచుకునేందుకు ప్రభాకర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.