రాజాసాబ్ మూవీలో నటిస్తున్న రెబెల్ స్టార్ ప్రభాస్ సడెన్‌గా ఇటలీలోని ఫ్లోరెన్స్‌కు వెళ్లాడని తెలిసింది. ఎందుకని ఆరా తీస్తే.. గత కొంతకాలం నుంచి ప్రభాస్ భుజం నొప్పి కారణంగా విపరీతమైన బాధను అనుభవిస్తున్నాడని తెలిసింది. ఒక్కసారి ఈ భుజం నొప్పి వస్తే కనీసం రెండు మూడు వారాల దాకా ఉంటుందట. ఈ నొప్పిని తగ్గించుకునేందుకు ప్రపంచంలోని ఎంతమంది వైద్యులకు చూపెట్టినా నయం కాలేదట.
అందుకే ఏం చేయాలో అర్థం కాక, అర్థాంతరంగా రాజా సాబ్ షూటింగ్ పనుల్ని ఆపుకుని.. ఫ్లోరెన్స్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడని సమాచారం. అయితే, మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. బెంగళూరుకు చెందిన ఓ రాజుల అమ్మాయితో పెళ్లి కూడా ఫిక్సయిందట. ఈ ఏడాదిలో పెళ్లి కూడా జరిగే ఛాన్స్ ఉందని సమాచారం. మరి, కాబోయే భార్యతో ఇటలీలోని ఫ్లోరెన్స్‌కు వెళ్లాడా? లేక కుటుంబ సభ్యులతో వెళ్లారా అని తెలియాల్సి ఉంది. ఏదీఏమైనా, రాజాసాబ్ త్వరగా కోలుకోవాలని.. బాహుబలి త్వరలో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని కోరుకుందాం.