Friday, May 2, 2025

ఏపీ అమ్మాయితో ప్రభాస్‌ పెళ్లి

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి జరగబోతోందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన అమ్మాయితో ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని… త్వరలోనే పెళ్లి జరగనుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ షోలో రామ్ చరణ్ చేసిన కామెంట్స్ ను కూడా నెటిజన్లు దీనికి జత చేస్తున్నారు. గణపవరంకు చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని ఆ షోలో రామ్ చరణ్ చెప్పిన మాటలు నిజమయ్యాయని… ఏపీకి చెందిన ఆ అమ్మాయి కుటుంబం హైదరాబాద్ లో సెటిల్ అయిందని… ఇరు కుటుంబాలు పెళ్లికి ఓకే చెప్పాయంటూ పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ టీమ్ స్పందించింది. ప్రభాస్ పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వార్తలను నమ్మొద్దని కోరింది. ఏదైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని తెలిపింది. 45 ఏళ్ల ప్రభాస్ ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు. త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి కూడా ప్రకటించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com