అవసరమవుతోందని ఫిలిం సర్కిల్స్ లో తాజా సమాచారం. ప్రస్తుతం ఇటలీ ట్రిప్‌లో ఉన్న ప్రభాస్ మరో రెండు నెలల వరకు వచ్చే అవకాశం లేదు. దీంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకు రూ.12 కోట్ల నష్టం వస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కెరియర్‌లో ఎన్నో వైవిధ్యమైన ప్రాజెక్ట్స్ చేసినా, మాస్ కమర్షియల్ డైరెక్టర్ మారుతితో చేసే కొత్త సినిమా మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. మిడ్ రేంజ్ కామెడీ ఎంటర్టైనర్లతో పేరు తెచ్చుకున్న మారుతి, బాహుబలి వంటి బడా పాన్ ఇండియా స్టార్ తో సినిమాకు డైరెక్షన్ చేయడమనేది అసలు ఎవరు ఊహించలేదు. అయితే, ఈ సారి మారుతి.. ప్రభాస్‌లో ఉన్న కామెడీ యాంగిల్ తెరపై చూపించబోతున్నాడు పైగా హారర్ ఎలెమెంట్స్ కూడా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కామెడీతో కథలను నడిపించడం మారుతి స్పెషల్ గా చెప్పుకోవచ్చు.
ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 15 రోజుల రీషూట్ అవసరమవుతొందట. ఇది ప్రభాస్ అభిమానులకు కొంత నిరాశ కలిగించే విషయమే. మొదట ప్రభాస్ ఇటలీ టూర్ ముగించగానే ఈ 15 రోజుల రీషూట్ పనులు ప్రారంభించాలని యూనిట్ భావించింది. కానీ, ఆయన తిరిగి రావడానికి ఇంకా రెండు నెలల సమయం పడుతుందని సమాచారం. ఈ ఆలస్యం వల్ల పీపుల్ మీడియా ఫ్యాక్టరీకు సుమారు రూ.12 కోట్ల వరకు అదనపు నష్టం ఎదురయ్యే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.
రాజా సాబ్ కి ఇన్ని అడ్డంకులు ఉన్నా, సినిమా అవుట్ పుట్ పై మూవీ టీం నమ్మకంగా ఉంది. కామెడీతో పాటు ప్రభాస్‌ను కొత్త కోణంలో చూపించాలన్న మారుతి లక్ష్యం, ఈ సినిమాని మరింత ఆసక్తికరంగా మార్చింది. అభిమానులు మాత్రం ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అనే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మరి డార్లింగ్ ఇటలీ ట్రిప్ ముగించుకొని ఇండియాకి ఎప్పుడు తిరిగొస్తాడో వేచి చూడలి..!