Wednesday, February 26, 2025

ప్రభాస్‌ పేరుతో ఓగ్రామం…ఎందుకంటే?

కొన్ని ప్రాంతాల్లోని కాలనీలు ఏరియాలు, అదే విధంగా ఊర్లకు డిఫరెంట్‌ పేర్లు ఉంటూ ఉంటాయి. అలాగే కాలనీలకి ఎక్కువగా వ్యక్తుల పేర్లు పెడుతుంటారు.రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ పేరుతో ఒక గ్రామానికి పేరు ఉండటం అది కూడా మన దేశంలో కాకుండా పొరుగు దేశంలో ఉండటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ పాప్యులారిటీ ప్రపంచవ్యాప్తం అయిన విషయం తెలిసిందే.

బాహుబలి, సాహో, సలార్ వంటి పాన్ ఇండియా మూవీలతో ప్రభాస్ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రభాస్ పేరుతో ఒక గ్రామం ఉందనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక గ్రామానికి ప్రభాస్ పేరు ఉండటం, అది కూడా భారతదేశంలో కాకుండా పొరుగు దేశం అయిన నేపాల్‌లో ఉండటం విశేషంగా మారింది.

ఒక తెలుగు మోటో బ్లాగర్ నేపాల్‌లో పర్యటిస్తుండగా, ఒక ఊరి పేరు ప్రభాస్ అని ఉండటాన్ని గమనించాడు. దీంతో అతను వెంటనే ప్రభాస్ పేరుతో ఉన్న గ్రామ బోర్డు కనిపించేలా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను నేపాల్‌లో ప్రభాస్ అనే ఊరిలో ఉన్నానని, మన తెలుగు వారికి ప్రభాస్ అనే పేరు వినగానే ఒక వైబ్ వస్తుందని, మీరు ఎప్పుడైనా ప్రభాస్ అనే పేరుతో ఉన్న గ్రామాన్ని చూశారా? అంటూ ఆ వీడియోలో ప్రశ్నించాడు.

 

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com