Sunday, October 6, 2024

ప్రభాస్‌..స్పిరిట్‌ మార్చాల్సిందే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఏడీ థియేటర్స్ లోకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అద్భుతమైన కలెక్షన్స్ తో ఈ మూవీ దూసుకుపోతోంది. వీకెండ్ పూర్తయ్యేనాటికి 500+ కోట్లు కలెక్షన్స్ సాధించడం గ్యారెంటీ అనే మాట ట్రేడ్ పండితుల నుంచి వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కల్కి మూవీ వైబ్ కనీసం రెండు వారాల పాటు నడిచే అవకాశం ఉంది. దీని తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోనే మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కల్కి సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతూ ఉండటంతో సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ పైన కూడా అంచనాలు పెరిగాయి. యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగా గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో స్పిరిట్ మూవీకి కూడా సందీప్ రెడ్డి వంగా కచ్చితంగా బెస్ట్ అవుట్ ఇస్తాడని డార్లింగ్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ చిత్రాన్ని టి-సిరీస్, సందీప్ రెడ్డి వంగా కలిసి నిర్మించబోతున్నారు. డార్లింగ్ ప్రభాస్ కెరియర్ ఇప్పటి వరకు చేయనటువంటి పోలీస్ ఆఫీసర్ రోల్ ని స్పిరిట్ చిత్రంలో చేయబోతున్నాడు. కథ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందంట. సందీప్ రెడ్డి సినిమాలలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా వైలెంట్ గా ఉంటుంది. స్పిరిట్ మూవీలో కూడా ప్రభాస్ పాత్ర అలాగే ఉండబోతోందంట. రీసెంట్ గా సందీప్ రెడ్డి, ప్రభాస్ మీట్ అయ్యారంట. ఈ సందర్భంగా సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ నుంచి డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular