Thursday, December 12, 2024

ఆకాశాన్నంటేలా విజయోత్సవాల ముగింపు వేడుకలు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈసందర్భంగ విజయోత్సవాల ముగింపు  వేడుకలను డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలలో ప్రజలను కూడా భాగస్వాములను చేసి  సంబరాలు జరుపుకునేలాకార్యక్రమాలను రూపొందించారు. ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్‌, హెచ్‌ఎండిఏ  గ్రౌండ్స్‌ వేదికగా పలు సంగీత, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ సంగీత కళాకారులు వందే మాతరం శ్రీనివాస్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, తమన్‌ ల సంగీత కచేరీలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. సందర్శకుల కోసం సాంస్కృతిక, ఫుడ్‌, హస్తకళల స్టాల్స్‌ ను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద బాణాసంచా ప్రదర్శన, ట్యాంక్‌ బండ్‌ వద్ద డ్రోన్‌ షో, భారత వాయు దళం చే ఎయిర్‌ షో ఆహుతులను ఆకట్టుకోనున్నాయి.

 ముగింపు వేడుకల వివరాలు :
సాంస్కృతిక కార్యక్రమాలు – మూడు వేదికలు (సాయంత్రం 5 నుంచి  9గంటలు), సంగీత కచేరీ వందేమాతరం శ్రీనివాస్‌ ( రాత్రి 7నుంచి  8.30 )  ఫుడ్‌ స్టాల్స్‌, హ్యాండీక్రాఫ్ట్‌ స్టాల్స్‌, కల్చరల్‌ స్టాల్స్‌,  నగరంలో వీధి దీపాల (జీఎచ్‌ఎంసి ప్రాంతం) అలంకరణ .. భారత వాయు దళంతో ఎయిర్‌ షో, సంగీత కచేరీ – రాహుల్‌ సిప్లిగంజ్‌ (రాత్రి 7నుంచి   8.30 వరకు),  సాంస్కృతిక కార్యక్రమాలు – (5నుంచి 9 వరకు) ఫుడ్‌ స్టాల్స్‌, హ్యాండీక్రాఫ్ట్‌ స్టాల్స్‌, కల్చరల్‌ స్టాల్స్‌.  నగరంలో వీధి దీపాల  అలంకరణ, తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ (5.00 గం.లు) , ముఖ్యమంత్రి బహిరంగ సభ  (5నుంచి 5.45వరకు) ,  డ్రోన్‌ షో (5.45 నుంచి  6 వరకు),  బాణసంచా (6.05 నుంచి  6.20వరకు),  ముఖ్యమంత్రి – కల్చరల్‌ వేదికకు చేరుకుంటారు. (6నుంచి10 మధ్యలో),  6. సంగీత కచేరీ – శ్రీ ఎస్‌ తమన్‌ (7 నుంచి 8.30 వరకు), సాంస్కృతిక కార్యక్రమాలు – (5నుంచి  9వరకు) ,ఫుడ్‌ స్టాల్స్‌, హ్యాండీక్రాఫ్ట్‌ స్టాల్స్‌, కల్చరల్‌ స్టాల్స్‌ , నగరంలో వీధి దీపాల అలంకరణ ఉంటుంది.

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular