Wednesday, March 12, 2025

నేడు ఎల్‌బి స్టేడియంలో ప్రజాపాలన విజయోత్సవాలు

సిఎం రేవంత్, మంత్రుల హాజరు
ఎల్‌బి స్టేడియంలో నేడు మధ్యాహ్నం ప్రజాపాలన విజయోత్సవాలను ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సీనియర్ ఐఏఎస్‌లు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది.

గత సంవత్సర కాలంలో విద్యార్థుల కోసం ప్రభుత్వం చేపట్టిన మార్పులు, డైట్ చార్జీల పెంపు, రాష్ట్రంలోని అన్ని పాఠశాల్లో ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలు, ఇంటి గ్రేటడ్ స్కూల్స్ ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలకు ఉచిత కరెంట్ తదితర కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా దాదాపు 14 వేల మంది పాఠశాల విద్యార్థులతో విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com