Sunday, April 20, 2025

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జిల్లాల నిర్లక్షం

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో హన్మకొండ, హైదరాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట జిల్లాల నిర్లక్షం వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశం
పెండింగ్ దరఖాస్తుల్లో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలు టాప్
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్ని జిల్లాల కలెక్టర్‌లను ప్రభుత్వం ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా 1,763 పెండింగ్ దరఖాస్తులతో మొదటిస్థానంలో నిలవగా, 1,154 పెండింగ్ దరఖాస్తులతో రెండోస్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, యాదాద్రి భువనగిరి 836 పెండింగ్ దరఖాస్తులతో మూడోస్థానంలో, సిద్దిపేట 598 పెండింగ్ దరఖాస్తులతో నాలుగో స్థానంలో నిలిచాయి.

వీటితో పాటు మిగతా జిల్లాలోనూ దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని వెంటనే వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా రెవెన్యూకు సంబంధించినవి ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే హన్మకొండ, హైదరాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట జిల్లాల అధికారులు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో నిర్లక్షం వహిస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. వెంటనే పరిష్కరించాలని ఆయా జిల్లాల కలెక్టర్‌లకు ప్రభుత్వం సూచించింది.

ప్రజావాణి దరఖాస్తులు ఇలా…
రాష్ట్రవ్యాప్తంగా ప్రజావాణిలో ప్రభుత్వానికి దరఖాస్తులు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు ప్రజావాణిలో 144 దరఖాస్తులు రాగా, అందులో 27 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లిలో 159 దరఖాస్తులు రాగా అందులో 76 పెండింగ్ ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో 302 దరఖాస్తులు రాగా, 251 పెండింగ్‌లో, మంచిర్యాలలో 249 దరఖాస్తులు రాగా, 104 పెండింగ్‌లో, ములుగులో 120 దరఖాస్తులు రాగా, 109 పెండింగ్‌లో, నిర్మల్‌లో 102 దరఖాస్తులు రాగా, 58 పెండింగ్, రాజన్న సిరిసిల్లలో 161 దరఖాస్తులు రాగా, 138 పెండింగ్‌లో, వికారాబాద్‌లో 478 దరఖాస్తులు రాగా, 107 పెండింగ్‌లో, వనపర్తిలో 201 దరఖాస్తులు రాగా, 186 పెండింగ్‌లో, వరంగల్‌లో 354 దరఖాస్తులు రాగా, 354 పెండింగ్‌లో ఆదిలాబాద్ జిల్లాలో 164 దరఖాస్తులు రాగా, 107 పెండింగ్‌లో, భద్రాద్రి కొత్తగూడెంలో 249 దరఖాస్తులు రాగా, 232 పెండింగ్‌లో, హన్మకొండలో 379 దరఖాస్తులు రాగా, 379 పెండింగ్‌లో, హైదరాబాద్‌లో

596 దరఖాస్తులు రాగా, 596 పెండింగ్‌లో, జనగాంలో 382 దరఖాస్తులు రాగా, 150 పెండింగ్‌లో, జోగులాంభ గద్వాల్‌లో 177 దరఖాస్తులు రాగా, 153 పెండింగ్‌లో, కామారెడ్డిలో 272 దరఖాస్తులు రాగా, 272 పెండింగ్‌లో, కరీంనగర్‌లో 422 దరఖాస్తులు రాగా, 102 పెండింగ్‌లో, ఖమ్మంలో 338 దరఖాస్తులు రాగా, 267 పెండింగ్‌లో, కుమురంభీం ఆసిఫాబాద్‌లో 191 దరఖాస్తులు రాగా, 164 పెండింగ్‌లో, మహబూబాబాద్‌లో 235 దరఖాస్తులు రాగా, 216 పెండింగ్‌లో, మెదక్‌లో 401 దరఖాస్తులు రాగా, 234 పెండింగ్‌లో, నాగర్‌కర్నూల్‌లో 396 దరఖాస్తులు రాగా, 396 పెండింగ్‌లో, నల్లగొండలో 646 దరఖాస్తులు రాగా, 637 పెండింగ్‌లో, నారాయణపేటలో 128 దరఖాస్తులు రాగా, 109 పెండింగ్‌లో, నిజామాబాద్‌లో 291 దరఖాస్తులు రాగా, 154 పెండింగ్‌లో, పెద్దపల్లిలో 192 దరఖాస్తులు రాగా, 172 పెండింగ్‌లో, సంగారెడ్డిలో 549 దరఖాస్తులు రాగా, 161 పెండింగ్, సూర్యాపేటలో 402 దరఖాస్తులు రాగా, 104 పెండింగ్‌లో ఉన్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com