అమృత, ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ రెండో అడిషనల్ సెషన్స్ కోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సుభాష్ శర్మ కు న్యాయస్థానం తాజాగా మరణశిక్ష విధించింది. సుభాష్ శర్మ బీహార్ కు చెందిన నేరస్తుడు. ఈ కేసులో మిగిలిన ముద్దాయిలకు జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. కాగా, తీర్పు సమయంలో శిక్ష తగ్గించాలని ముద్దాయిలు న్యాయమూర్తిని వేడుకున్నారు. తాము పిల్లలు గలవాళ్లమని, ఈ కేసుతో తమకు సంబంధం లేదని అమృత బాబాయి శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. తనకు ముగ్గురు పెళ్లికాని పిల్లలు ఉన్నారని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ కేసులో ఏ1గా ఉన్న మారుతిరావు (అమృత తండ్రి) 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు.