Wednesday, May 7, 2025

హైకోర్టును ఆశ్రయించిన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్ రావు

  • హైకోర్టును ఆశ్రయించిన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్ రావు
  • తన కస్టడీపై కిందికోర్టు ఆదేశాలపై హైకోర్టులో సవాల్

టీఎస్ న్యూస్ :ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు , ఎస్ ఐ బి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు హైకోర్టును ఆశ్రయించారు. తనను పోలీస్ కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మంగళవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు తనను కస్టడీకి ఇచ్చిందని పిటిషన్ ప్రణీత్ ఆరోపించారు. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని ఆయన పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లో నిద్రపోవడానిక సరైన సౌకర్యాలు కూడా లేవని పిటిషన్ లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ పూర్తి అయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆయన కోరారు. దర్యాప్తులోని అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారని ప్రణీత్ రావు ఆరోపించారు. ఎందుకు లీక్ చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. రహస్యం పేరుతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారని ప్రణీత్ రావు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. బంధువులు, న్యాయవాదిని కూడా అనుమతించడం లేదని తెలిపారు. విచారణ సమయంలో ఎఎస్పీ డి. రమేష్ పాల్గొనకుండా నియంత్రించాలని కోరారు. ఈ క్రమంలో ప్రణీత్ రావు కస్టడీపై పోలీసుల వివరణ కోరుతూ విచారణను బుధవారం నాటికి హైకోర్టు వాయిదా వేసింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com