Saturday, May 17, 2025

ప్రవీణ్‌ కెరీర్‌కు మరో మైలురాయి ‘బకాసుర రెస్టారెంట్‌’

పలు విజయవంతమైన చిత్రాలతో మంచి నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’, ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌, ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌.జే. శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు మారుతి ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ ”భకాసుర రెస్టారెంట్‌ త్వరలో మీ ముందుకు రాబోతుంది. మా ట్రైలర్‌ మారుతి చేతుల మీదుగా విడుదల కావడం హ్యపీగా ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం నా కెరీర్‌ సెట్‌ కావడానికి ఎంతో ఉపయోగపడింది. మరోసారి ఆయన నా సినిమా ట్రైలర్‌కు రావడం ఆనందంగా ఉంది. ఆయనకు నా కృతజ్ఞతలు.’ అన్నారు. మారుతి మాట్లాడుతూ ” ఈ సినిమాకు టైటిల్‌తోనే విజయం సాధించారు. మంచి టైటిల్‌ పెట్టారు. సినిమా కూడా బాగుంటుందనే ఫీల్‌ కలుగుతుంది. మంచి టైటిల్‌ ఈ సినిమాకు పెట్టడంతో మంచి పాజిటివ్‌ వైబ్‌ ఉంది. చాలా రోజుల నుంచి ప్రవీణ్‌ను హీరోగా చూడాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. డెఫినెట్‌గా ఈ సినిమా ప్రవీణ్‌ కెరీర్‌కు మరో మైలురాయిగా నిలుస్తుంది. తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్‌ అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించి ఈ సినిమా యూనిట్‌ అందరికి మంచి పేరు తీసుకరావాలని అని కోరుకుంటున్నాను’ అన్నారు. నిర్మాత జనార్థన్‌ ఆచారి మాట్లాడుతూ ” శివ ఈ లైన్‌ చెప్పగానే బాగా నచ్చింది. వెంటనే ఈ పాత్రకు ప్రవీణ్‌ అనుకున్నాం. పాత్రకు తగ్గ ఆర్టిస్టులు ఈ సినిమాకు కుదిరారు అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com