Friday, December 27, 2024

ఫిబ్రవరి 16న థియేటర్స్ లో ప్రవీణ్ ఐపిఎస్

ప్రవీణ్ IPS (ఇక ప్రజా సేవలో) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రవీణ్ IPS ట్రైలర్ ను సీనియర్ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు, ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల విడుదల చేశారు.
సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని పలువురు వక్తలు అన్నారు.  ఐరా ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్పై మామిడాల నీల ప్రొడ్యూసర్గా నిర్మితమైన ప్రవీణ్ IPS ఈ నెల 16న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా
 సి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… ప్రవీణ్ IPS జన హృదయాలను కదిలిస్తుందని అన్నారు. చాలామంది ఆదర్శాల కోసం సినిమాలు తీస్తే వాటిని జనం ఆదరించరని ఒక తప్పుడు అభిప్రాయం ఉందని ‘మాల పిల్ల’, ‘రైతుబిడ్డ’ వంటి సినిమాల్లో ఆదర్శమే చూపించారని, ఆదర్శం (ఐడియలిజం) అనేది జన హృదయాలను తాకుతుందని అన్నారు.
నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ… డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా అనేక విప్లవాత్మక మార్పులు విద్యారంగంలో తీసుకొచ్చారని అన్నారు. పూర్ణ మలావతి, ఆనంద్లను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహింపజేశారని గుర్తు చేశారు. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం చాలా గొప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.
పిల్లా జమీందర్ ఫేమ్ ప్రొడ్యూసర్ డీఎస్ రావు మాట్లాడుతూ ప్రవీణ్ IPS సినిమాల్లో పొలిటికల్ అంశాలున్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుందని, సినిమా రిలీజ్ అయ్యాక సంచలనం సృష్టిస్తుందని అనిపిస్తుందని అన్నారు. ఎలక్షన్ పీరియడ్లో ప్రవీణ్ IPS రిలీజ్ అవుతుందని , పెద్ద సక్సెస్ అవుతుందని అభిప్రాయపడ్డారు. నటీనటులు, డైరెక్టర్లకు మంచి పేరొస్తుందని అన్నారు.
డాక్టర్ అరుణ మాట్లాడుతూ… డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి పదేళ్ల క్రితం విన్నానని గుర్తు చేశారు. ఎవరైన చదువుకోవడం కష్టమనిపించిన స్టూడెంట్స్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి స్పీచ్లు చూడాలని సలహా ఇస్తానని చెప్పారు. ప్రవీణ్ IPS మూవీ ట్రైలర్ చూస్తుంటే ప్రవీణ్ గారి ఎన్ని కష్టాలు అనుభవించారోనని, ఈ రోజుల్లోనూ వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని, సినిమా బాగుంటుందని భావిస్తున్నట్లు చెప్పిన ఆమె పిల్లలకు ఈ సినిమాను చూపిస్తే ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని చెప్పారు.
హీరో నంద కిషోర్ మాట్లాడుతూ… ప్రవీణ్ IPSలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి రోల్ పోషించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. తనకు ఈ అవకాశం వివేక్ కూచిభొట్ల గారి వల్ల వచ్చిందని గుర్తు చేశారు. ఆర్ఎస్పీ గారు మానవత్వం ఉన్నవారని, ఆ మానవత్వం వల్లనే ఆయన ఎంతో మందికి సాయం చేశారని, ఆ సంకల్పం చాలా గొప్పదని, ఆయన ఎంతో మందికి ఆదర్శమని అన్నారు. ఆర్ఎస్పీగారిలాగే తెర మీద కనిపించేందుకు తన వంతు ప్రయత్నం చేశానని తెలిపారు.
డైరెక్టర్ దుర్గా దేవ్ నాయుడు మాట్లాడుతూ… ప్రవీణ్ IPS మూవీ తనకు డెబ్యూ ఫిల్మ్ అని, ఛాన్స్ ఇచ్చిన మామిడాల నీల గారికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జీవితాన్ని మూడు పార్టులుగా మూడు సినిమాలు తీయాలి. కానీ తాము సెలెక్టివ్ అంశాలను తీసుకొని ప్రవీణ్ IPS మూవీ తీశామని అన్నారు. ఆర్ఎస్పీ గారు తనకు ఇన్స్పిరేషన్ అన్నారు.  అతి తక్కువ రోజుల్లో ప్రవీణ్ IPS మూవీ పూర్తి చేశామని గుర్తు చేశారు. వివేక్ కూచిభోట్ల గారు లేకపోతే తనకు ప్రవీణ్ IPS మూవీ అవకాశం వచ్చేది కాదని చెప్పారు. తనకు అన్ని విషయాల్లో అండగా నిలిచిన వివేక్గారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రవీణ్ IPS మూవీకి పని చేసిన టెక్నిషీయన్లు, ఆర్టిస్టులు బాగా సహకరించాని, హీరో నంద కిషోర్ గారు ఒక స్టూడెంట్లా మారి సహకరించారని గుర్తు చేశారు. ఆర్ఎస్పీ గారి క్యారెక్టర్ను నందకిషోర్ గారు పర్ఫెక్ట్గా పోట్రే చేశారన్నారు. హీరోయిన్ రోజా గారు కూడా ఎంతో ఓపికగా పని చేశారు. ఆర్ఎస్పీగారి సతీమణి లక్ష్మీబాయిగారి క్యారెక్టర్ను బాగా చేశారన్నారు.
హీరోయిన్ రోజా మాట్లాడుతూ… ఆర్ఎస్పీగారిలా ఉండాలని ఆయన గురించి తెలుసుకున్నాక అర్థమైందని అన్నారు. విద్యాప్రాముఖ్యతను ఈ మూవీలో చూపించారని, చిన్న పిల్లలకు ఈ సినిమాను చూపించాల్సిన అవసరముందని ఆమె చెప్పారు. మూవీని చాలా తక్కువ రోజుల్లో కంప్లీట్ చేశామన్నారు.
ASKES ఫౌండేషన్ చైర్మన్ కొల్లూరి సత్తయ్య మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నో కష్టాలను భరించి ఐపీఎస్ అధికారిగా ఎన్నో సేవలు చేశారని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా పేద పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని కోచింగ్ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రవీణ్ IPS మూవీ హిట్ కావాలని ఆకాంక్షించారు.
డీఓపీ నాగ్ సోధనపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ ఎన్ఎస్ ప్రసు, ఎడిటర్ కె.విశ్వనాథ్, లిరిసిస్టులు రామదుర్గం, కిరణ్లు తదితరులు హాజరై మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ సీనియర్ నేత విజయ్ ఆర్య, లీగల్ అడ్వయిజర్ సురేష్, స్వేరోస్ నాయకులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com