Monday, May 26, 2025

బైక్​ పైనుంచి కిందపడి గర్భిణీ మృతి

తట్టుకోలేక భర్త బలవన్మరణం

వారిద్దరూ ఏడాది క్రితం ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. భార్య గర్భం దాల్చడంతో ఇటీవలే బంధువుల సమక్షంలో సంబరంగా సీమంతం వేడుక జరిపారు. అంతలోనే రోడ్డు ప్రమాద రూపంలో వచ్చిన మృత్యుపాశం భార్యను కబళించింది. దీంతో ఆమె మృతిని తట్టుకోలేక భర్త సైతం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుందలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం బిచ్కుందకు చెందిన మంగలి సునీల్‌(30) అనే వ్యక్తికి గతేడాది మద్నూర్‌ మండలం పెద్దతడ్గూర్‌ గ్రామానికి చెందిన జ్యోతి (27)తో వివాహం జరిగింది. ఆమె 5 నెలల గర్భం దాల్చగా, ఈ నెల 14న బిచ్కుందలో సీమంతం వేడుక చేశారు.

అనంతరం సునీల్ భార్య జ్యోతిని పుట్టింట్లో వదిలిపెట్టి వచ్చారు. శనివారం రాత్రి తిరిగి ఆమెను బిచ్కుందకు తీసుకొచ్చేందుకు భర్త సునీల్‌ వెళ్లారు. భార్యాభర్తలు బైక్​పై వస్తుండగా బిచ్కుంద శివారులోని పెద్ద మైసమ్మ గుడి వద్ద వాహనం వేగంగా వెళుతుండటంతో జ్యోతి జారి కింద పడ్డారు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన అంబులెన్సులో బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా, దారి మధ్యలోనే మృతిచెందారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బిచ్కుందకు తీసుకురాగా, ఇంటి వద్ద కుటుంబసభ్యుల రోదనలు కలచివేశాయి.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com