హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. మూడేండ్ల నుంచి సాగుతూ వస్తున్న ఈ ఎన్నికలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి మొదలైంది. గత ఎన్నికల్లోనే ప్రెస్ క్లబ్ ఎన్నికలు అభాసుపాలైన విషయం తెలిసిందే. నిజానికి, ప్రెస్‌క్లబ్ ఎన్నికలు ప్రతి రెండేండ్లకోసారి జరగాల్సి ఉండగా.. పాలకవర్గం నిర్లక్ష్యం, కోర్టు కేసు కారణంగా దాదాపు ఏడాది కాలం అదనంగా కొనసాగుతూ వచ్చింది. అయితే, మార్చి 23న జరిగిన జనరల్ బాడీ సమావేశంలో జనరల్ సెక్రటరీ హాజరు కాకపోవడంతో సభ్యులు మండిపడుతున్నారు. ప్రస్తుతం పదవీకాలం ముగిసిన పాలకవర్గం పెద్దగా ఏం చేసింది లేదనే విమర్శల్ని మూటగట్టుకుంది.
ప్రెస్‌క్లబ్‌లో గత మూడేళ్లలో.. హైదరాబాద్ వాటర్ బోర్దు నుంచి రూ. 60 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు మాత్రమే జరిగాయి. అది కూడా ఒక ఈసీ మెంబర్ కారణంగానే ఈ పనులు జరిగాయని అందరికీ తెలిసిందే. అంతకు మించి ఒక్కటి కూడా అక్కరకొచ్చే పనులు కాలేదని సభ్యులు భావిస్తున్నారు.
రెగ్యులర్‌గా నిర్వహించే మహిళా దినోత్సవం, ఇఫ్తార్ విందులు, కొత్త సంవత్సర వేడుకలు వంటి వాటికి లక్షల్లో ఖర్చు పెట్టి చేతులు దులుపుకున్నారు. అంతకు మించి ఈ పాలక వర్గం చేసిన పని ఒక్కటీ కనిపించడం లేదనే విమర్శలున్నాయి. అయితే వచ్చే నెల మే 4న, ప్రెస్ క్లబ్ ఎన్నికల్ని నిర్వహిస్తారని తెలిసింది.