Sunday, April 20, 2025

చంద్రబాబు-రేవంత్ తో మాట్లాడిన ప్రధాని మోదీ-వరద సాయంపై హామీ

తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోను ఎక్కడికక్కడ జనజీవనం స్థంబంచిపోయింది. ఏపీ, తెలంగాణలోని సుమారు 400 గ్రామాలు నీటిలో మునిగిపోవడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇటు చంద్రబాబు సర్కార్, అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. మరీ ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నిన్న ఆదివారం ఉదయం నుంచి స్వయంగా వరద సహాయక కార్యక్రమాల్లో అలుపెరగకుండా స్వయంగా పాల్గొంటున్నారు.

భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో ఫోన్ లో మాట్లాడారు. వర్షాలు, వరదల దృష్ట్యా రెండు రాష్ట్రాల్లోని పరిస్థితిపై ఆరా తీశారు. ముంపు ప్రాంతాలు, జన-ఆస్తి నష్టంపై సమాచారం తెలుసుకున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులతో మాట్లాడి రెండు రాష్ట్రాల్లో వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వర్షాలు, వరదలను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని అమిత్ షా రెండు రాష్ట్రాలకు హామీ ఇచ్చారు. వరద ప్రభావిత రాష్ట్రాల సీనియర్ అధికారులతో హోం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోందని, వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాలను రంగంలోకి దించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదల్లో ఆంధ్రప్రదేశ్ లో 9 మంది, తెలంగాణలో 9 మంది చనిపోయినట్లు ప్రకటించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com