Thursday, May 8, 2025

ప్రధాని పర్యవేక్షణ.. ఆపరేషన్‌ లేడీస్‌.. ఎవరీ వ్యోమికా, ఖురేషీ..?

ఇద్దరు మహిళలు.. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి వివరించారు. ఈ ఇద్దరు మహిళలకు ఆపరేషన్‌ సిందూర్‌ బాధ్యతలు ఇచ్చారా.. అంటే నిజమేనంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. ఎందుకంటే ఈసారి ఉగ్రదాడిలో తీవ్రంగా అన్యాయానికి గురైంది.. నష్టపోయింది మహిళలే. మహిళల కోసం ఈ ఆపరేషన్‌ చేస్తున్నట్లుగా.. ఆపరేషన్‌ పేరు సిందూర్‌ పెట్టారు. అలాంటిది.. ఆపరేషన్‌ కూడా వాళ్లకే అప్పగించారు. ఆపరేషన్ సిందూర్.. ఇద్దరు మహిళా సైనికాధికారుల పర్యవేక్షణలో జరిగింది.

అది ఢిల్లీలోని భారత ప్రధాని నరేంద్రమోదీ అధికారిక నివాసం. అర్థరాత్రి 12 గంటలు దాటింది. ప్రధాని మోదీకి ఏదో ఒక ముఖ్యమైన సమాచారం వచ్చింది. ఆల్‌ ది బెస్ట్‌ చెప్పి.. ఒకే చెప్పారు. ఆ తర్వాత భారత సైనిక శిబరాల నుంచి అత్యాధునికి పీ8ఐ విమానాలు గాల్లోకి ఎగిరాయి. అంతే.. ప్రధాని కూర్చున్న గదిని ఏసీ చల్లదనం ముంచెత్తినా.. మోదీకి మాత్రం చెమటలు కారుతున్నాయి. అలా బుధవారం తెల్లవారుజాము వరకు అంత టెన్షన్‌లోనూ ఆయన ఏదో పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు సైనికాధికారి కార్యాలయం నుంచి మెస్సేజ్‌ వచ్చింది. ఆపరేషన్‌ సిందూర్‌ సక్సెస్‌.. ఆల్‌ సేఫ్‌ అని.. అంతే.. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నిద్రహారాలు మాని పర్యవేక్షణ చేసిన ప్రధాని మోదీ.. ఈ ఆపరేషన్‌తో తమ బలం చెప్పాలని.. తామెంటో చూపించాలని ఇద్దరు మహిళా సైనికాధికారుల ముఖంలో నవ్వు విరబూసింది.

ఇలా జమ్ముకశ్మీర్‌ ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై బుధవారం ఉదయం ఇద్దరు మహిళా అధికారులు వివరించారు. భారత చరిత్రలోనే తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు సైనిక్ ఆపరేషన్‌పై అధికారికంగా విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. ఇప్పుడు వీరిద్దరి గురించే యావత్ భారత్ చర్చించుకుంటోంది. వారే కల్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌. ఇంతకీ ఎవరు వీరిద్దరు.. అనేది అంతటా చర్చగా మారింది. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.

వింగ్ కమాండర్‌ వ్యోమికా సింగ్‌..

పైలెట్ కావాలన్నది వ్యోమికా సింగ్ కల. అందుకోసం ఎంతో కష్టపడ్డారు కూడా. ఇంజనీరింగ్ పూర్తి చేసి వ్యోమికా.. తన కలను తీర్చుకునే దిశగా అడుగులు వేశారు. ఇందులో భాగంగానే 2004లో ఐఏఎఫ్‌‌లో చేరారు ఆమె. 2017లో వింగ్ కమాండ్‌ హోదా పొందారు. డిసెంబర్ 18, 2019న ఫ్లయింగ్ బ్రాంచ్‌లో శాశ్వత కమిషన్‌ హోదా పొందారు. అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో కూడా చేతక్, చీతా హెలికాఫ్టర్లను నడిపి రికార్డు సృష్టించారు వ్యోమికా సింగ్. వైమానికి రంగంలో ఎంతో పేరు పొందారు. హై-రిస్క్ ఫ్లయింగ్ ఆపరేషన్లలో వ్యోమికా సింగ్ సేవలందించారు.

కర్నల్ సోఫియా ఖురేషి ఎవరంటే

సోఫియా ఖురేషీ స్వస్థలం గుజరాత్. 1990లో సోఫియా సైన్యంలో చేరారు. కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి.. 2016లో పుణెలో జరిగిన ఎక్సర్‌సైజ్ 18 పేరిట భారత ఆర్మీకి చెందిన బృందానికి నాయకత్వం వహించి తొలి మహిళా అధికారణిగా చరిత్ర సృష్టించారు. ఇందులో 18 దేశాలు పాల్గొనగా.. కేవలం భారత్ బృందానికి మాత్రమే మహిళ నాయకత్వం వహించారు. ఆమెకు పీస్ కీపర్‌గా ఎంతో అనుభవం ఉంది. 2006 కాంగోలో పీస్ మిషన్‌కు ఆమె అందించిన సహకారం ప్రత్యేకంగా నిలిచింది. ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వకారణం. మూడు దశాబ్దాలకు పైగా భారత సైన్యానికి సేవలందించారు. ఆమె రాజీలేని వైఖరి, నిర్భయ ప్రయత్నాలతో ఎన్నో ప్రశంసలను అందుకున్నారు. అలాగే దేశ యువతను భారత సైన్యంలో చేరాలని కూడా సోఫియా ఖురేషి పిలుపునిచ్చారు.

మొత్తంగా ఉగ్రవాదాన్ని వెనకేసుకువస్తూ.. వారిని మోస్తున్న పాకిస్థాన్‌కు ఇప్పుడు గట్టి దెబ్బ తగిలింది. అయితే, ఈ ఆపరేషన్‌ను ఆషామాషీగా చేయలేదు. మోదీ స్వయంగా పర్యవేక్షిస్తే.. అటు వ్యూహకర్త అజిత్‌ దోవల్‌ పక్కా ప్లాన్‌ వేశాడు. దీంతో ఆపరేషన్‌ సిందూర్‌ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అనుకున్న లక్ష్యాలను ఢీకొట్టింది. పీఓకేలోని మొత్తం 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసిన దాడిపై ప్రధాని అనుక్షణం తెలుసుకున్నారు. భారత బలగాలు ఉగ్రవాద స్థావరాలను విధ్వంసం చేయడాన్ని మోదీ రాత్రంతా నిరంతరం పర్యవేక్షించారని కొందరు అధికారులు జాతీయ మీడియాకు తెలిపారు. ఇలా ఈ ఆపరేషన్‌లో అంతా భాగస్వామ్యం అయ్యారు. పాక్‌ ఆయువుపట్టు మీద కోలుకోలేని దెబ్బ వేశారు. భారత సైన్యం అంటే ఏమిటో మరోసారి చూపించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com