Friday, December 27, 2024

ఈసారి ప్రియాంక ఈ నెల 21రాష్ట్రానికి రాక

టీఎస్​, న్యూస్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు గానీ కనీసం 10 నుంచి 14 స్థానాలను దక్కించుకోవాలని ఊవ్వీలూరుతోంది. ఈ మేరకు పార్టీ ఏఐసీసీ అధిష్టానంతో కలిసి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు వ్యూహాలకు పదనుపెడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఒకవైపు ప్రతిపక్షాలను చావు దెబ్బతీస్తూనే… మరోవైపు తనదైన మార్కుతో కాంగ్రెస్ ను గెలిపించాలన్న పట్టుదలతో సీఎం ఉన్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వంటి నేతలను రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా ఎన్నికల ప్రచారం మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు.

Also Read: దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలంటూ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్

ఇటీవల తుక్కుగుడాలో నిర్వహించిన బహిరంగ సభకు రాహుల్ గాంధీ రాగా….ఈ నెల 21న భువనగిరిలో నిర్వహించే భారీ బహిరంగ సభ కు ప్రియాంక గాంధీని తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయనున్నారు. ఇందులో భాగంగా బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లారు. భువనగిరి పార్లమెంట్ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన విది విధానాలపై దిశానిర్దేశం చేశారు.

సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ కింది స్థాయి నుంచి పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. భువనగిరి టికెట్ ఆశించి అసంతృప్తితో ఉన్న నేతలు సమన్వయంతో ముందుకు పోవాలని సూచించారు. బహిరంగ సభ జరిగే రోజునే పార్టీ అభ్యర్ధిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేయనున్నట్లు పార్టీ ముఖ్య నేతలకు సీఎం వెల్లడించారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధుల నామినేషన్ల కార్యక్రమానికి తాను స్వయంగా హాజరుకానున్నట్లు రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com