Sunday, March 16, 2025

ప్రియాంక గాంధీ వాద్రా అను నేను..

తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ.. వయనాడ్‌ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రియాంక గాంధీ వాద్రా అనే నేను.. లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికైనందున చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉంటానని“ ప్రమాణం చేశారు. వాయనాడు ఎంపీగా ప్రియాంక గాంధీ చేతిలో రాజ్యాంగం పట్టుకొని మరీ ప్రమాణం చేశారు. ప్రియాంక గాంధీని పలువురు ఎంపీలు అభినందించారు. ప్రియాంక ప్రమాణం చేసేందుకు డయాస్ పైకి రాగా.. కాంగ్రెస్ సభ్యులు గట్టిగా అరిచారు.

వాయనాడు లోక్ సభ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. బై పోల్‌లో పోటీ చేసిన ప్రియాంక గాంధీ 4 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. ముందుగా ప్రియాంక తన తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ, సోదరుడు, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో కలిసి పార్లమెంట్‌కు చేరుకున్నారు. లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించారు. పోడియం వద్దకు వెళ్లిన ప్రియాంక.. ముందుగా తమ చేతిలో ఉన్న రాజ్యాంగ ప్రతిని చూపించిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com