Saturday, November 16, 2024

 సీఎం రేవంత్‌ రెడ్డికి ఆ దమ్ముందా..? ప్రముఖ నిర్మాత సవాల్

తెలంగాణలో సినీ, రాజకీయ వర్గాల్లో అక్కినేని నాగార్జునకు కు సంబందించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ హాట్ టాపిక్‌ గా మారింది. మాధాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ అక్రమంగా చెరువును అక్రమించి నిర్మించారని తేలడంతో అధికారులు దాన్ని కూల్చేశారు. తన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను అక్రమ కట్టడం పేరుతో కూల్చివేయడాన్ని అక్కినేని నాగార్జున తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు హైడ్రా, తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలు తమను తప్పుగా అనుకోకుండా ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా చేసిన కూల్చివేతపై కోర్టులోనే తేల్చుకుంటానని నాగార్జున తేల్చిచెప్పారు.స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అక్కినేని నాగార్జున తన ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే.

ఐతే ఎన్ని ఒత్తిడిలు వచ్చినా కూల్చివేతల విషయంలో తగ్గేదెలే అని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి. ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తాజాగా ఈ వివాదంపై టాలీవుడ్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. కూల్చడం స్టార్ట్ చేస్తే సగం హైదరాబాద్‌ని కూల్చేయాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు తెలిసినంత వరకు నాగార్జున ఆ ల్యాండ్‌ని కొనుక్కున్నాడని చెప్పారు భరద్వాజ. చెరువు సైడ్‌ ఉన్న మూడెకరాలు కబ్జా అని, దాన్ని కూల్చామంటుని ప్రభుత్వం చెబుతున్నా.. అందులో నిజమెంతా అనేది తెలియదు. అయితే అక్రమంగా నిర్మించిన కట్టడాలన్నీ కూడా ఇలాగే కూలుస్తారా అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు.

మోకీలా పరిధిలో చాలా అక్రమ కట్టడాలు, ఫామ్‌ హౌజ్‌లు నిర్మించారని చెప్పిన భరద్వాజ.. అలా కూల్చుకుంటూ పోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీఎం, మాజీ సీఎం, మాజీ సీఎం అమ్మాయి, అబ్బాయి అందరి ఫామ్‌ హౌజ్‌లు కూల్చేయాలని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ లో చాలా చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని అన్నారు. యూసఫ్‌ గూడలో చెరువు ఉండేదని చెప్పిన భరద్వాజ.. ఇప్పుడు ఓ వైపు కృష్ణకాంత్‌ పార్క్, మరోవైపు ఇళ్లు వచ్చేశాయని.. మరి వాటి సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారితో పాటు, గత ప్రభుత్వంలోని నేతల ఇళ్లు కూడా కూల్చాలని.. అలా కూల్చి సాహసం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేస్తారా.. అని తమ్మారెడ్డి సవాల్ విసిరారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular