Sunday, March 16, 2025

అంబేద్కర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ ఘంటా చ‌క్రపాణి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివ‌ర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం వైస్ ఛాన్స్‌ల‌ర్‌ను నియ‌మించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంబేద్కర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ ఘంటా చ‌క్రపాణిని నియ‌మిస్తూ ఉత్తర్వులు వెల్లడించింది.

ఈ ప‌దవిలో చ‌క్రపాణి మూడేండ్ల పాటు కొన‌సాగ‌నున్నారు. గ‌తంలో అంబేద్కర్ ఓపెన్ యూనివ‌ర్సిటీలో సోషియాల‌జీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెస‌ర్‌గా చ‌క్రపాణి విధులు నిర్వర్తించారు. తెలంగాణ ఏర్పడిన త‌ర్వాత టీఎస్‌పీఎస్సీ తొలి చైర్మన్‌గా ఘంటా చ‌క్రపాణి సేవ‌లందించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com