- ఉద్యోగులు, అధికారులు కష్టపడి పనిచేయాలి
- ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ చెవ్వూరు హరి కిరణ్
ఎక్సైజ్ శాఖకు మంచి పేరు తీసుకరావాలని దానికోసం ఉద్యోగులు, అధికారులు కష్టపడి పనిచేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ చెవ్వూరు హరి కిరణ్ పేర్కొన్నారు. డిప్యూటీ కమిషనర్లు వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. అందరూ సమష్టిగా కృషి చేస్తేనే వ్యవస్థలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానం లభిస్తుందని ఆయన అన్నారు. మంగళవారం సాయంత్రం అబ్కారీ భవన్‌లో తెలంగాణలోని పది డివిజన్ల డిప్యూటీ కమిషనర్‌లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
పది డివిజన్‌లలో ఎక్సైజ్ అధికారుల పనితీరు, మద్యం అమ్మకాలు, ఎంఆర్పీ, వయిలేషన్, క్రైమ్ కంట్రోల్‌పై సమీక్ష నిర్వహిస్తూ స్థానికంగా నెలకొన్న పరిస్థితులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్‌తో పాటు అడిషనర్ కమిషనర్ అజయ్‌రావు, జాయింట్ కమిషనర్లు ఖురేషీ, కేఏబి శాస్త్రీ, సురేష్, బెవరీస్ జనరల్ మేనేజర్లు అబ్రహం, కాశీనాథ్, పది జిల్లాల డిప్యూటి కమిషర్లు పి.దశరథ్, జి .అంజన్‌రావు, వి.సోమిరెడ్డి, ఏ.శ్రీనివాసరెడ్డి, టి.డేవిడ్ రవికాంత్, నర్సింహారెడ్డిలు హాజరయ్యారు.