ఆస్తిపన్ను బకాయిల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలో టాప్‌టెన్ బకాయి విలువ 203 కోట్లు ఉన్నట్లు సమాచారం. దీనిపై జీహెచ్ ఎంజీ వారెంట్లు జీరీ చేసింది. వందికిరెడ్ నోటీసులు కూడా జారీ చేసింది. 5లక్షలకు పైన ఉన్న బకాయిల విలువ 860కోట్లుగా అధికారులు నిర్ధారించారు. ఈ చర్యలలో భాగంగా జీహెచ్‌ఎంసీ అధికారులు ఇటీవల బంజారాహిల్స్ ప్రాంతంలోని ప్రముఖ తాజ్ బమజారా హోటల్‌ను కూడా సీజ్ చేయడం అందరికి తెలిసిందే. హోటల్ యాజమాన్యం రూ.1.43కోట్ల బకాయిని చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. దీంతో అధికారులు హోటల్‌ను సీజ్ చేశారు. హోటల్ యాజమాన్యం వెంటనే స్పందించి ఉదయం 9గంటలకు ఆర్టీజీఎస్ ద్వారా రూ.51.50లక్షలు చెల్లించింది. మిగిలిన బకాయిని మార్చి15లోపు చెల్లించేందుకు పరిమితి కోరింది. వెంటనే అధికారులు సీల్‌ను తొలగించారు.
ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లను 100 శాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ సర్కిల్ అధికారులు ట్యాక్స్ కలెక్షన్‌ను కఠినంగా అమలుచేస్తున్నారు.