Tuesday, April 22, 2025

పునాటి నరసింహారావుకు ఇండియన్ పోలీస్ మెడల్

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా…ఇండియన్ పోలీసు మెడల్ అందుకున్న మియాపూర్ ఏసీపీ పునాటి నరసింహరావు ఉద్యోగంలో నిబద్ధత కలిగి ఉండటం… ఏ విభాగంలో పని చేసినా… అక్కడ అత్యుత్తమ సేవలందించడం… డిపార్ట్ మెంట్ లో ఉన్నతాధికారుల చేత మన్ననలు అందుకోవడం ఆ పోలీసు అధికారికి మొదటి నుంచి ఉన్న ట్రాక్ రికార్డ్. అందుకే ఇప్పుడు ఇండియన్ పోలీస్ మెడల్ ను అందుకుని మరోసారి తన వర్క్ లో సిన్సియారిటీని చూపించారు. ఆయన ఎవరో కాదు… హైదరాబాదులోని మియాపూర్ ఏసీపీ పునాటి నరసింహరావు.

మియాపూర్ ఏసిపిగా పనిచేస్తున్న ఆయన ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపికయ్యారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన మెడల్ ను అందుకున్నారు. 1995లో ఎస్సైగా విధుల్లో చేరిన ఆయన 2009లో సి.ఐగా పదోన్నతి పొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో చాలా సమర్థవంతంగా విధులు నిర్వర్థించారు. పోలీసు ఉన్నతాధికారుల చేత ప్రశంసందుకొన్నారు. పోలీస్ శాఖలో ఆయన చేసిన సేవలకు గాను గతంలోనూ ఉత్తమ సేవా పతకం అందుకోగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్(ఐ.పి.యమ్)కు ఎంపిక చేసింది. 2021లో ఏసీపీగా పదోన్నతి పొందిన ఆయన… ఇంటిలిజెన్స్ విభాగంలో కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం నరసింహారావు మియాపూర్ ఏసిపిగా విధుల్లో కొనసాగుతున్నారు. ఇండియన్ పోలీస్ మెడలను అందుకున్న ఆయనకు మియాపూర్ సబ్ డివిజన్ కు చెందిన పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

ఇలాగే మరెన్నో మెడల్స్ అందుకోవాలని ఆకాంక్షించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించడం, డిపార్ట్ మెంటుపై ప్రజలకు నమ్మకం కలిగించడం… అవగాహన, కౌన్సెలింగ్ ద్వారా నేరాలు చేయకుండా ప్రజలను అప్రమత్తం చేయడం లాంటివి చేస్తూ… తన ఉద్యోగధర్మ నిర్వర్తిస్తున్నట్టు ఏసీపీ నరసింహరావు… మెడల్ అందుకున్న సందర్భంగా చెప్పారు. తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల సహకారంతోనే తాను డిపార్టుమెంటులో అత్యుత్తమ సేవా పతకాలు పొంది… ప్రజలకు మరింత చేరువ అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సహకారం మరువలేనిదని ఆయన అన్నారు. భవిష్యత్తులోనూ తన శక్తి మేరకు మంచి సేవలందించడమే తన కర్తవ్యమని ఆయన చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com