- అవినీతి అధికారులపై కొరడా..?
- ఐఏఎస్‌లు, ప్రిన్సిపాల్ సెక్రటరీలు,
- అధికారులను బదిలీ చేసే అవకాశం
- స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, ఎక్పైజ్ శాఖలపై
- సిఎం రేవంత్‌కు భారీగా ఫిర్యాదులు
ఈ మూడు శాఖలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయం
ఎన్నికల కోడ్ తరువాత స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, ఎక్పైజ్ శాఖలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్టుగా సమాచారం. దీంతోపాటు పలు జిల్లాల ఐఏఎస్‌ను, పలు శాఖల కమిషనర్‌లు, ప్రిన్సిపాల్ సెక్రటరీలను పూర్తిస్థాయిలో మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే శాఖలను సమర్ధవంతంగా నిర్వహించే అధికారులకు ఈ బాధ్యతలను అప్పచెప్పాలని సిఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్టుగా సమాచారం. ప్రస్తుతం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, ఎక్పైజ్ శాఖల్లో పనిచేసే కొందరు అధికారుల అవినీతిపై వరుసగా సిఎంఓకు ఫిర్యాదులు వస్తుండడంతో ఆ శాఖల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధమయినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే సిఎం రేవంత్‌రెడ్డి బదిలీలకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువగా ఉన్న అధికారులను తప్పించి, వారి స్థానంలో కీలక మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో చాలా ఏళ్లుగా బదిలీలు లేకపోవడం….
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో కొన్ని సంవత్సరాలుగా బదిలీలు లేకపోవడం, ప్రస్తుతం పదోన్నతులు కూడా కల్పించాల్సి ఉండడంతో ఆ శాఖను ఈసారి కచ్చితంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. గతంలో ఒకటి, రెండు సార్లు ఈ శాఖలో బదిలీలు జరిగినా కొంతమేర మాత్రమే అవి జరిగాయని పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరగలేదని ప్రభుత్వం గుర్తించింది. దీంతోపాటు చాలామంది సబ్ రిజిస్ట్రార్‌లు పదవీ విరమణ చేయడం ఉన్న సీనియర్ అసిస్టెంట్‌లతో ఇన్‌చార్జీ సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించాల్సి రావడంతో ఈసారి పదోన్నతులతో పాటు పూర్తి స్థాయిలో సబ్ రిజిస్ట్రార్‌లతో ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు ఇన్‌చార్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్‌లతో పాటు సబ్ రిజిస్ట్రార్‌లపై అవినీతి ఆరోపణలు అధికం కావడంతో ప్రక్షాళన కచ్చితంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. ఈ శాఖలో జరుగుతున్న అవినీతికి సంబంధించి మంత్రికి సైతం భారీగా ఫిర్యాదులు రావడంతో బదిలీలను పారదర్శకంగా ఎలాంటి ఫైరవీలకు తావులేకుండా చూడాలని నిర్ణయించినట్టుగా తెలిసింది.
జిఎస్టీ వసూళ్లలో అవినీతి…తప్పుడు క్లైయిమ్‌లపై ప్రభుత్వం సీరియస్
ఇక వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన జిఎస్టీ వసూళ్లలో అవినీతితో పాటు తప్పుడు క్లైయిమ్‌లపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఆ శాఖలో కొందరు అధికారులకు స్థానం కల్పించాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఇప్పటికే పలువురు అవినీతి అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు మరికొందరికి షోకాజ్ నోటీసులను కూడా జారీచేసిన ఆ శాఖ ఉన్నతాధికారులు సమర్ధవంతమైన అధికారులకు మంచి పోస్టింగ్ ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలిసింది. ఈ శాఖ ఉన్నతాధికారులతో ఇప్పటికే సిఎం రేవంత్‌తో జరిపిన సమీక్షలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండిపడకుండా చర్యలు చేపట్టాలని, అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించిన నేపథ్యంలో ఆ శాఖ కమిషనర్ కూడా సమర్ధవంతమైన అధికారులకు మంచి పోస్టింగ్ ఇవ్వడానికి ఉన్నతాధికారులు చర్యలు చేపట్టినట్టుగా తెలిసింది. రానున్న రోజుల్లో ఆదాయం పెంపొందించడానికి చేపట్టాల్సిన అంశాలు, తప్పుడు క్లైయిమ్‌ల సంఘటనలు మరోసారి జరగకుండా చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించడంతో ఆ దిశగా ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టినట్టుగా సమాచారం.
గతంలో ఈ శాఖలో కొన్ని బదిలీలు జరిగినా….
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఎక్పైజ్ శాఖలోనూ బదిలీలు జరిగినా పూర్తి స్థాయి ప్రక్షాళన ప్రభుత్వం చేపట్టలేదు. ఇప్పటికే ఈ శాఖపై వస్తున్న అవినీతి ఆరోపణల గురించి ఇప్పటికే సిఎం రేవంత్‌రెడ్డి, సంబంధిత మంత్రి సైతం చర్చించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆదాయం గండిపడకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలని, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మద్యం రాకుండా అడ్డుకట్ట వేయడం ఎలా అన్న దానిపై ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా తెలిసింది. ఇందులో భాగంగా అవినీతి అధికారులను బదిలీ చేయడంతో పాటు పనిచేసే అధికారులకు పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ శాఖలోని అవినీతి అధికారుల చిట్టా ప్రభుత్వం వద్దకు చేరినట్టుగా తెలిసింది. అందులో భాగంగా రానున్న రోజుల్లో ఈ శాఖను కూడా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచార