Tuesday, May 13, 2025

పూరీ- విజయసేతుపతితో నిహారిక

టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ – కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి ‌ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో క్యాస్టింగ్‌ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు పూరీ. ఇక ఇప్పటికే ఈ మూవీలో సీనియర్ నటి టబు నటిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ తర్వాత ఏ తెలుగు సినిమాను ఒప్పుకోని టబు.. ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పూరీ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధిక ఆఫ్టే కూడా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూఎన్సర్ నటించనున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇన్‌ఫ్లూఎన్సర్ మరెవరో కాదు నిహారిక ఎన్‌.ఎమ్‌. గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కంటెంట్ క్రియేటర్ గా ఆమె వీడియోస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రీసెంట్ గానే వైభవ్ హీరోగా నటించిన ” పెరుసు “చిత్రంలో నిహారిక హీరోయిన్ గా నటించింది. అలానే తెలుగులో కూడా ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది ఈమె. పెరుసు చిత్రంలో తనదైన నటనతో మెప్పించింది నిహారిక. ఆ సినిమా చూసిన పూరీకి.. నిహారిక నటన నచ్చడంతో.. పిలిచి ఆడిషన్ చేయడం, ఓ పాత్రకు సరిగ్గా సరిపోతుందని అనిపించడంతో.. ఆమెను ఓకే చేసినట్టు చెబుతున్నారు. ఈ మూవీతో పూరీ గట్టి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుండగా.. కరెక్ట్ టైమ్ లో మంచి బ్రేక్ ఇచ్చే మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ జూన్‌లో ప్రారంభమవుతుందని.. మరిన్ని అప్‌డేట్స్‌ త్వరలో ప్రకటిస్తామని ఆ పోస్టులో రాసుకొచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com