కుంభమేళా దీని గురించి తెలియని వారుండరు. ఉత్తరప్రదేశ్‌లో ఎంతో ఘనంగా జరుగుతుంది ఈ జాతర. అయితే ఈ మేళాలో కొత్తగా ప్రతరోజు ఏదో ఒక చిత్ర విచిత్రం జరుగుతూనే ఉంటుంది. వాటిలో కొన్ని సోషల్ మీడియాలో కూడా హైలెట్ అవుతున్నాయి. కుంభమేళా ఆరంభం అయినప్పటి నుంచి ఒక అమ్మాయి గురించి ప్రముఖంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ అమ్మాయి పేరు మోనాలిసా. ఇండోర్‌కి చెందిన మోనాలిసా ఫ్యామిలీ కుంభమేళాలో పూసల దండలు, రుద్రాక్ష దండలు అమ్ముకోవడానికి వెళ్లారు. కుంభమేళాలో కొందరు యువకులు ఈమెను చూసి చాలా అందంగా ఉంది అంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె కళ్లు చాలా స్పెషల్‌గా ఉన్నాయంటూ ఆ వీడియోకు మంచి స్పందన వచ్చింది. కుంభమేళాకు వెళ్లిన వారిలో చాలా మంది ఇప్పుడు మోనాలిసా ఎక్కడ ఉంది అంటూ వెతకడం మొదలు పెట్టారు. ఆమె ఎక్కడ కనిపిస్తే అక్కడ గుంపులుగా ఏర్పడి ఆమెతో సెల్ఫీకి ఎగబడుతున్నారు. ఆమెను కాపాడేందుకు ఒకానొక సమయంలో ఫ్యామిలీ మెంబర్స్‌కి చాలా ఇబ్బందిగా మారింది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఇలా వైరల్ కావడం మనం చూస్తూనే ఉంటాం. మోనాలిసా సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే ఎవరో ఒకరు కచ్చితంగా పిలిచి సినిమా ఆఫర్లు ఇస్తారని అంతా భావించారు. అనుకున్నట్లుగానే బాలీవుడ్ నుంచి మోనాలిసాకి సినిమా ఆఫర్ వచ్చింది. అయితే సినిమా ఆఫర్ పై మోనాలిసా స్పందన ఏంటి అనేది చూడాలి. బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా తన సినిమాలో కుంభమేళా మోనాలిసాకి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. త్వరలోనే మోనాలిసాను కలుస్తాను అన్నాడు. అయితే ఆయన తీయబోతున్న సినిమా ఏంటి, ఆమెను ఏ పాత్ర కోసం ఎంపిక చేయబోతున్నది క్లారిటీ ఇవ్వలేదు. నటిగా చేసే ఉద్దేశ్యం మోనాలిసాకు ఉందా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ వంటి అతి పెద్ద ఇండస్ట్రీలో నటించే అవకాశాల కోసం లక్షల మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి అవకాశం వస్తే మోనాలిసా వదులుకోదు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.