హీరో వచ్చే విషయం పోలీసులకు తెలపని థియేటర్ యాజమాన్యం
డిసిపి ఆకాన్ష్ యాదవ్పు ష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా బుధవారం రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 ఎంఎం థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో దిల్ బుక్ నగర్ కు చెందిన రేవతి (35) మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్(13) అపస్మాక స్థితిలో చికిత్స పొందుతున్న కేసులో థియేటర్ యాజమాన్యంతో పాటు సినీహీరో అల్లుఅర్జున్, అతని వ్యక్తిగత సిబ్బందిపై కేసులు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డిసిపి ఆకాంన్ష్ యాదవ్ తెలిపారు. 105, 118(1),రెడ్ విత్ 3(5) బి ఎన్ ఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిక్కడపల్లి ఏసిపి రమేష్ కుమార్, ఇనస్పెక్టర్ రాజు నాయక్ లతో కలిసి ఆయన వివరాలను వెల్లడించారు. ఈ ఘటనలో మరి కొంతమంది గాయాలకు గురయ్యారని చెప్పారు. పుష్ప 2 సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ ప్రీమియర్ షో చూసేందుకు థియేటర్ కు వస్తున్నట్లు యాజమాన్యం పోలీసులకు సమాచారం అందజేయలేదని స్పష్టం చేశారు. హీరో వస్తున్న సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి రద్దీ ఏర్పడుతుందన్న ఆలోచనతో థియేటర్ యాజమాన్యం
భద్రతా చర్యలు తీసుకోలేదన్నారు. దాంతోపాటు హీరో థియేటర్లోకి ప్రవేశించేందుకు అనువుగా ప్రత్యేక ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయలేదని తెలిపారు. హీరోను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా థియేటర్లోకి చచ్చుకొని రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ క్రమంలో దిల సుక్ నగర్ కు చెందిన ప్రకాష్ భార్య రేవతి చనిపోయారని, వారి కుమారుడు శ్రీతేజ అపత్మార్గ స్థితిలో అత్యవసర చికిత్స పొందుతున్నారని తెలిపారు. తొక్కిసలాటలో థియేటర్లో అపరస్ మార్క స్థితిలో పడి ఉన్న వారిని బయటకు తీసుకువచ్చి పోలీసులు వెంటనే సిపిఆర్ నిర్వహించి సమీపంలోని దుర్గాబాయి దేశ్ముఖ ఆసుపత్రికి తరలించగా అప్పటికే రేవతి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని, మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం శ్రీతేజను మరో ఆసుపత్రికి తరలించాలని సూచించగా తరలించడం జరిగిందని అతనికి చికిత్స జరుగుతుందని వివరించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామని తెలిపారు. రేవతి మృతదేహానికి గురువారం సాయంత్రం పోస్టుమార్టం పూర్తయిందని, మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని చిక్కడపల్లి ఇనస్పెక్టర్ రాజు నాయక్ తెలిపారు.