Friday, April 4, 2025

పుష్ప 2 జ‌పాన్‌లో షూట్ చేస్తారా?

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2లో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’కు సీక్వెల్‌గా వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆగస్ట్ 15 న ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రధాన బాషల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆయన ఎక్కడా తగ్గకుండా సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కన్నడ అందం రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. ఇతర పాత్రల్లో సునీల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, ఫాహద్ ఫజిల్, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. ఇక అది అలా ఉంటే అల్లు అర్జున్ తాజాగా తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు బుధ‌వారం ఖైరతాబాద్ ఆర్‌టిఓ కార్యాలయానికి వెళ్లారు. అయితే పుష్ప2లో కొన్ని సీన్స్ జపాన్‌లో తీయనున్నారట. అందులో భాగంగానే అల్లు అర్జున్ అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఇక ప్రస్తుతం సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రం తరువాత అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీతో ఓ మాస్ యాక్షన్ మూవీని చేయనున్నాడని తెలిసిందే.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com