Sunday, December 29, 2024

పూనకాలు తెప్పిస్తోన్న ‘పుష్ప 2 టీజర్

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప‌:2 ది రూల్’. ‘పుష్ప ది రైజ్‌’తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న పుష్ప‌-2 ది రూల్‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆకాశ‌మే హ‌ద్దుగా అంచ‌నాలు వున్నాయి. ఏప్రిల్ 8, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్ అందరికీ పూనకాలు తెప్పిస్తోంది.

ఈ టీజర్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగమ్మ జాతర గెటప్‌లో వీర మాస్ అవతార్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతకు ముందు టాలీవుడ్‌లో ఏ హీరో కనిపించని విధంగా ఊర మాస్ అవతార్‌లో కనిపించి.. సినిమాపై అమాంతం అంచనాలను పెంచేశారు. గంగమ్మ జాతరలో వచ్చే సన్నివేశంతో టీజర్ కట్ చేసిన విధానం.. అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.

అల్లు అర్జున్ ఇందులో చీరకట్టి.. కాలు వెనక్కి మడిచి పైట కొంగుని అందుకున్న తీరు చూస్తుంటే.. ‘పుష్ప2: ద రూల్’ నీయవ్వ అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా ఉండబోతుందనే హింట్‌ని ఇచ్చేస్తోంది. ఇందులో అల్లు అర్జున్ లుక్, యాటిట్యూడ్, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. ప్రపంచ సినీ ప్రేక్షకులంతా మరోసారి పుష్పరాజ్‌ గురించి మాట్లాడుకునేలా చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ పార్ట్ 2లో అల్లు అర్జున్ విశ్వరూపం చూడబోతున్నారనేది ఈ టీజర్‌తో మరోసారి సుస్పష్టమైంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com