Friday, December 27, 2024

Pushpa 2 Trailer : పుష్ప-2 ట్రైలర్… మామూలు ఫైరు కాదు… వైల్డ్ ఫైరు!

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప2 ది రూల్. నేడు బీహార్ రాజధాని పాట్నాలో పుష్ప-2 ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే అంటే అతిశయోక్తి కాదు. ఎవడ్రా వాడు… డబ్బంటే లెక్కలేదు… పవర్ అంటే భయం లేదు అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.

  • పుష్ప… పేరు చిన్నదే… సౌండ్ చాలా పెద్దది…!
  • శ్రీవల్లి నా పెళ్లాం… పెళ్లాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటదో పెపంచకానికి చూపిస్తా
  • పార్టీ ఉంది పుష్పా… పార్టీ ఉంది!
  • నాకు రావాల్సిన పైసా అణా అయినా, అర్ధణా అయినా… అది ఏడుకొండల మీదున్నా… ఏడు సముద్రాలు దాటున్నా… పోయి తెచ్చుకునేదే పుష్పగాడి అలవాటు!
  • పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా… ఇంటర్నేషనలు…!
  • పుష్ప అంటే ఫైరు కాదు…. వైల్డ్ ఫైరు.

ఇలా పవర్ ఫుల్ డైలాగులతో పుష్ప-2 ట్రైలర్ ఉర్రూతలూగిస్తోంది. అల్లు అర్జున్ హీరోయిజం తొలిపార్టును మించిపోయిందన్న విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. పుష్ప ది రైజ్ లో చివర్లో కాసేపు కనిపించి ఎవడ్రా వీడు అనిపించిన ఫహాద్ ఫాజిల్ సెకండ్ పార్ట్ లో ఫుల్ టైమ్ కనిపించనున్నాడు. దాంతో ఎంటర్టయిన్ మెంట్ ఏ రేంజిలో ఉంటుందో అని అభిమానులు ఇప్పటినుంచే అంచనాలు వేసుకుంటున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com