Monday, March 10, 2025

పుష్ప లాభాలతో పింఛన్లు ఇవ్వండి కోర్టులో మళ్లీ పుష్ప పంచాయితీ

పుష్ప-2 సినిమా లాభాలపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. పుష్ప- 2 ది రూల్‌కు వచ్చిన లాభాలను చిన్న చిత్రాలకు, బడ్జెట్‌ రాయితీకి వినియోగించాలని, జానపద కళాకారుల పింఛన్‌ కోసం కేటాయించాలని తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది నరసింహరావు ఈ పిల్‌ దాఖలు చేశారు. బెనిఫిట్‌ షోలు, టికెట్ ధరల పెంపు వల్ల పుష్ప-2 చిత్రానికి భారీగా ఆదాయం వచ్చిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులిచ్చి మరీ బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరలు పెంచుకోవడానికి అనుమని ఇచ్చిందని తెలిపారు. బెనిఫిట్‌ షో, టికెట్‌ ధరలు పెంపునకు అనుమతివ్వడానికి గల కారణాలేంటో చెప్పలేదని కోర్టుకు వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చిత్రాల లాభాలను కళాకారుల సంక్షేమానికి కేటాయించాలని కోరారు. ఇప్పటికే బెనిఫిట్‌ షోలు, టికెట్ల వసూలు ముగిసింది కదా అని సీజే ప్రశ్నించగా వాటి వల్ల వచ్చి న లాభం గురించే పిటిషన్ దాఖలు చేశామని న్యాయవాది తెలిపారు. అందుకు తగిన విధంగా సుప్రీంకోర్టు తీర్పు కాపీని సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com