Thursday, May 29, 2025

పుష్ప ఆఫర్‌ని మిస్‌ చేసుకున్నా

విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నారా రోహిత్. అయితే కొన్నేళ్లుగా సినిమాల్లో వేగం తగ్గించాడు. మే 30న ‘భైరవం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇదిలా ఉంటే, మధ్యలో ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఆ సినిమా ఏదో కాదు.. పుష్ప. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రెండు భాగాలుగా వచ్చిన ‘పుష్ప’ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇందులో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర కోసం మొదట నారా రోహిత్ ని సంప్రదించారట. రోహిత్ కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు. కానీ, ఆ తర్వాత పుష్పను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేయాలనే ఉద్దేశంతో ఇతర భాషల నటులను తీసుకున్నారు. అలా పుష్ప సినిమాని రోహిత్ మిస్ చేసుకున్నాడు. భైరవం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని స్వయంగా రోహిత్ పంచుకున్నాడు.
‘పుష్ప’లో షెకావత్ రోల్ రోహిత్ చేస్తే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రోహిత్ తనదైన డైలాగ్ డెలివరీ, సెటిల్డ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా ‘రౌడీ ఫెలో’ సినిమాలో ఫుల్ ఇగో ఉన్న రానా ప్రతాప్ జయదేవ్ అనే పాత్రలో రోహిత్ నటనతో అదరగొట్టాడు. పుష్పలో షెకావత్ పాత్ర కూడా అలాంటి ఇగో ఉన్న పోలీస్ పాత్రనే. ఆ రోల్ రోహిత్ చేసుంటే.. యాక్టర్ గా పాన్ ఇండియా వైడ్ గా ఓ రేంజ్ లో ఆఫర్స్ వచ్చి ఉండేవేమో.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com