ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప 2: ది రూల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదలైంది. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచి బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది పుష్ప-2. అదే సమయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ అదరగొడుతోంది. రిలీజ్ అయిన 20 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.1600 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో సినిమాగా నిలిచింది. రెండో ప్లేస్ లో ఉన్న బాహుబలి-2 చిత్రాన్ని వెనక్కి నెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే సినిమా రిలీజ్ అయ్యాక.. మేకర్స్ ఫుల్ వీడియో సాంగ్స్ ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పుష్ప.. పుష్ప.., కిస్సిక్, పీలింగ్స్ వీడియో సాంగ్స్ ను విడుదల చేశారు. రీసెంట్ గా రెండు రోజుల క్రితం దమ్ముంటే పట్టుకోరా షెకావత్ సాంగ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఆ సాంగ్ కు సుకుమార్ లిరిక్స్ అందించగా.. అల్లు అర్జున్ ఆలపించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. అయితే సాంగ్ రిలీజ్ అయ్యాక.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగింది. ఓవైపు సంధ్య థియేటర్ వివాదం తీవ్రమవుతున్న వేళ.. ఆ పాటను ఎందుకు రిలీజ్ చేశారని కొందరు ప్రశ్నించారు. అవసరమా అని అన్నారు. ఎందుకంటే ఆ పాట.. దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అంటూ సాగే లిరిక్స్ తో మొదలవుతుంది. సినిమాలో షెకావత్ అనేది పోలీస్ ఆఫీసర్ రోల్ అన్న విషయం తెలిసిందే. అందుకే ప్రస్తుతం బన్నీపై పోలీస్ కేసు నడుస్తుండడంతో.. అలాంటి లిరిక్స్ తో ఉన్న పాటను రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని కొందరు హితవు పలికారు. దీంతో ఆ వీడియో సాంగ్ యూట్యూబ్ లో కనిపించడం లేదు. టీ సిరీస్ తెలుగు యూట్యూబ్ ఛానెల్ లో ఉన్న సాంగ్ ను మేకర్స్ డిలీట్ చేసినట్లు క్లియర్ గా తెలుస్తుంది. సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో డిలీట్ చేసినట్లు ఉన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా మంచి పని చేశారని అంటున్నారు. ఇప్పుడు సాంగ్ డిలీట్ చేసిన విషయం.. నెట్టింట వైరల్ గా మారింది. ఏది ఏమైనా సాంగ్‌లో లిరిక్స్ కాస్త రెచ్చగొట్టేటట్టే ఉన్నాయి కాబట్టి ఈ పాట తీసేయడమే న్యాయం. అంతేకాక చిత్రంలోని కొన్ని సీన్స్ కూడా మెగా హీరోలను రెచ్చగొట్టినట్లు ఉన్నట్లు కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆ మధ్య చర్చలు సాగాయి.