Sunday, April 6, 2025

ఇసుక, మట్టి మాఫియాను మంత్రి ప్రోత్సహిస్తున్నారు:

శ్రీధర్​ బాబుపై పుట్ట మధు ఆరోపణలు

ఇసుక ,మట్టి మాఫియాను మంత్రి శ్రీధర్ బాబు ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఆరోపించారు. మంథని నియోజక వర్గంలో యథేచ్ఛగా ఇసుక తరలిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. మైనింగ్ ప్రమాణాలు పాటించకుండా మట్టిని తరలిస్తున్నారని విమర్శించారు.

ఒక లారీకి పర్మిషన్ ఉంటే వంద లారీల్లో మట్టి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని విమర్శలు చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును శ్రీధర్ బాబు కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళ్తుందన్నారు. ఓటుకు 2వేల రూపాయలు ఇచ్చి శ్రీదర్ బాబు ఎమ్మెల్యేగా గెలిచారని ఆరోపించారు. ఎన్నికలప్పుడు ఇసుక మాఫియా గురించి నీతులు చెప్పిన శ్రీధర్ బాబు అదే దందాకు ఇపుడు తెరలేరని ధ్వమెత్తారు. నియోజక వర్గ స్థాయిలో అధికారులు తామెన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని పుట్టా మధు అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com