Monday, November 18, 2024

రాజ్యసభకు ఆర్‌ కృష్ణయ్య రాజీనామా

రాజ్యసభకు ఆర్‌ కృష్ణయ్య రాజీనామా ఆమోదించిన చైర్మన్‌

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఏపీ రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నిన్న రాజీనామాను సమర్పించగా రాజ్యసభ చైర్మన్‌ మంగళవారం ఆమోదించారు. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కృష్ణయ్య తన పదవికాలం మరో నాలుగేళ్ల పాటు ఉండగానే తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వాలకు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు.

2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు రాజీనామా బాట పట్టారు. అదేవిధంగా రాష్ట్రంలోని ఎమ్మెల్సీలు, పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లకు చెందిన చైర్మన్లు, మేయర్‌లు సైతం వైసీపీకి రాజీనామా చేసి అధికార టీడీపీ, జనసేన పార్టీలో చేరారు.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 11 స్థానాలకు గాను 11 స్థానాలను వైసీపీ గెలుచుకుని సంఖ్యాబలం పరంగా రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కృష్ణయ్య రాజీనామాతో వైసీపీకి మరో గట్టి షాక్‌ తగిలినట్లయ్యింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular