టాలీవుడ్ హీరోయిన్లు అంటే? ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఉంటారు. అడపా దడపా తెలుగు హీరోయిన్లు కనిపిస్తుంటారు. ఇలాంటి వారికి ఇండస్ట్రీలో కూడా ఎలాంటి చుట్టరికాలు కూడా ఉండవు. అయితే తెలుగు హీరోయిన్ శ్రీలీల కు మాత్రం మంచి చుట్టరికాలే ఉన్నట్లు కనిపిస్తుంది. నటుడు రానా, దర్శకుడు అనీల్ రావిపూడికి శ్రీలీల దూరపు బంధువులా కనిపిస్తుంది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రానా తాను తన ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ కు వెళ్లిన అక్కడ శ్రీలీల కనిపిస్తుందన్నాడు. తాను వెళ్లి అడిగితే వాళ్లు మా చుట్టాలేనని శ్రీలీల చెబుతుందట. అంటే రానాకి-శ్రీలీలకు దూరపు బంధుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అనీల్ రావిపూడికి కూడా శ్రీలీలకు బంధుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లు ఇద్దరు ఎక్కడికక్కడ ఫ్యామిలీ ఈవెంట్లలో తారస పడుతున్నారట. ఇదంతా బాగానే ఉంది. మరి వాళ్లతో కలిసి పనిచేసే అవకాశం శ్రీలీలకు ఎప్పుడు వస్తుందో చూడాలి. రానా ఇప్పటికే కొత్త సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. కొంత కాలంగా ఆయన కూడా నిర్మాతగా బిజీగా కనిపి స్తున్నాడు. నటుడిగా కంటే? నిర్మాణంలో దూకుడు చూపిస్తున్నాడు. కానీ ఈ ఏడాది మాత్రం వెండి తెరపై మెరవాలని చూస్తున్నాడు. మరి శ్రీలీల రానాతో కలిసి నటించే అవకాశం వస్తుందో లేదో వేచి చూడాలి.