కాబోయే కోడలికి ఖరీదైన బహుమతి
హాజరుకానున్న సినీ, రాజకీయ ప్రముఖులు
పూర్తి హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుక
మరికొన్ని గంటల్లో అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. నేడు హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చైతూ, శోభిత పెళ్లి జరగనుంది. ఈ వివాహ వేడుకకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక పెళ్లికి సినీ, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరకానున్నారు. ప్రభాస్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, అల్లు అర్జున్ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతారని సన్నిహిత వర్గాల సమాచారం. ఇక చైతన్య-శోభితల వివాహ వేడుక పూర్తి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగనుంది. సుమారు ఏడెనిమిది గంటల పాటు పెళ్లికి సంబంధించిన అన్ని క్రతువులు ఒకదాని తర్వాత ఒకటి నిర్వహిస్తారట.
ఇదిలాఉంటే.. ఈ పెళ్లి సందర్భంగా ఇంటికి రాబోయే కోడలికి నాగార్జున ఖరీదైన బహుమతి ఇవ్వబోతున్నారని కుటుంబ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల నాగ్ రూ. 2 కోట్లు పెట్టి టయోటా లెక్సస్ కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. శోభిత పెళ్లి కూతురు అలంకరణ లో ఆకట్టుకుంటున్నారు. ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వివాహా వేడుకకు ఎవరెవరు? హాజరుకానున్నారనే విషయమై వార్తలు వచ్చాయి. సినీ, రాజకీయ రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా రానున్నట్లు తెలుస్తోంది.