Friday, April 4, 2025

అమెజాన్ ప్రైమ్ లో రాధా మాధవం

పరువు హత్యల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చి మెప్పించాయి, అలాంటి ఒక కంటెంట్ తో వచ్చిన సినిమానే ‘రాధా మాధవం’. గోనాల వెంకటేశ్ నిర్మించిన ఈ సినిమాకి, దాసరి ఇసాక్ దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ సినిమా ప్రస్తుతం ‘అమెజాన్ ప్రైమ్’లో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు నూతన నటీనటులతో రూపొందించిన ఈ సినిమాను కుటుంభం మొత్తం కలిసి చూడొచ్చు. నిజానికి ‘రాధామాధవం’ అనేది చాలా ఫీల్ గుడ్ టైటిల్. కనుక కంటెంట్ కూడా అలాగే ఉంది, ఎక్కడా అశ్లీలత లేకుండా క్లీన్ గా ఉంది.

కథాకథనాలలో కొత్తదనంతో దర్శకుడు సినిమాను నడిపిన విధానం బాగుంది. పరువు హత్యలు, పట్టింపులు, ప్రేమలు, ఆప్యాయతలు, పల్లెటూరు వాతావరణం వాటి అంశాలను పిరియాడిక్ స్టైల్ లో ప్రేక్షకులకు రీచ్ అయ్యే విధంగా సినిమా ఉంటుంది.

విలేజ్ లవ్ స్టోరీలు ఈ మధ్య ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇలాంటి విలేజ్ లవ్ స్టోరీనే రాధా మాధవం అనే సినిమా కూడా . ఈ చిత్రంలో వినాయక్ దేశాయ్, అపర్ణ దేవి హీరో హీరోయిన్లుగా నటించగా గోనాల్ వెంకటేష్ నిర్మించారు. వసంత్ వెంకట్ బాలా కథ, మాటలు, పాటలు అందించారు. మార్చి 1న ఈ సినిమా వన్ మీడియా ద్వారా థియేటర్స్ లో విడుదల అయ్యింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com