తిరుమల, శ్రీకాకుళంలోని అరసవల్లి ఆలయాలకు భక్తులు రద్దీ పెరిగింది. నేడు రథ సప్తమి కారణంగా దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమలలో సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో మలయప్ప స్వామిని ఊరేగించనున్నారు. సూర్యకిరణాలు తాకిన వెంటనే వాహన సేవలు ప్రారంభమవుతాయి.
అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి ఆలయంలో జరుగుతున్న వేడుకల్లో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలు శంకర్, గోవిందరావు, గౌతు శిరీష పాల్గొన్నారు. 7 గంటలకు ప్రారంభం కానున్న స్వామివారి నిజరూప దర్శనం సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిపోయాయి.