డీజే టిల్లు సినిమాతో సిద్ధు ఎంత పాపులర్ అయ్యాడో ఆ సినిమా హీరోయిన్ నేహా శెట్టి కూడా అంతే క్రేజ్ తెచ్చుకుంది. అంతకుముందు గతంలో ఈ అమ్మడు నటించిన చిత్రాలకు ఇంతగా పాపులారిటీ రాలేదు. కానీ డీజే టిల్లులో చేసిన రాధిక పాత్ర ఆమెను పాపులర్ అయ్యేలా చేశాయి. ఆ సినిమా తర్వాత నేహాకి వరుస ఆఫర్లు వచ్చాయి. ఐతే ఆ సినిమాలు కూడా క్రేజీ సినిమాలే అయినా ఎందుకో అమ్మడికి అవి సక్సెస్ అందించలేకపోయాయి. నేహా శెట్టి విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఫిమేల్ లీడ్ గా చేసింది. ఆ సినిమాలో ఆమె క్లాసీ లుక్స్ ఇంప్రెస్ చేశాయి. కానీ ఎందుకో అమ్మడికి ఆ తర్వాత ఛాన్స్ లు రాలేదు. ఇక టిల్లు స్క్వేర్ లో కూడా సర్ ప్రైజ్ క్యామియో చేసిన నేహా శెట్టి ఆ సినిమా 100 కోట్లు కొట్టినా కూడా అమ్మడికి ఎలాంటి యూజ్ లేకుండా పోయింది. ఆల్రెడీ హీరోయిన్ గా చేసింది కాబట్టి వేరే రోల్స్ చేసే ఛాన్స్ లేదు. అందుకే నేహా శెట్టి మళ్లీ ఆలోచనలో పడింది. స్పెషల్ సాంగ్స్ చేసేందుకు రెడీ అంటున్నా అలాంటి అవకాశాలు రావట్లేదు. ఐతే నేహా శెట్టి తిరిగి ఫాంలోకి రావాలంటే మళ్లీ అమ్మడికి టిల్లు ఛాన్స్ ఇవ్వాల్సిందే. టిల్లు క్యూబ్ ఎప్పుడు తీసినా నేహా శెట్టికి అందులో ఒక పాత్ర కన్ఫర్మ్ అవుతుంది. ఆ సీక్వెల్ ఎన్ని కథలతో తీసినా ఈ రాధిక పాత్ర కొనసాగుతూనే ఉంటుంది. నేహా శెట్టి మాత్రమే కాదు టిల్లు స్క్వేర్ లో అనుపమ ఆ రేంజ్ లో రెచ్చిపోయినా కూడా ఆమెకు కూడా పెద్దగా కలిసి రాలేదు. ఐతే అతను కూడా జాక్ తో షాక్ తిన్నాడు.