గతంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు వెంకటేష్‌తో చెప్పిన మాట నిజమయిందని ఆయన అన్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయం అందుకోవడం ఆనందంగా ఉందని విక్టరీ వెంకటేష్ అన్నారు. క్లీన్ ఎంటర్‌టైనర్ మూవీ చేస్తే తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని ఆయన అన్నారని తెలిపారు. వెంకటేశ్ హీరోగా దర్శకుడు రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి విజయం అందుకున్న సందర్భంగా చిత్ర బృందం విక్టరీ వేడుక నిర్వహించింది. ఈ వేడుకకు కె. రాఘవేంద్రరావు, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, వశిష్ఠ అతిథులుగా హజరుకాగా, ఈ సందర్భంగా పలువురు ఎగ్జిబిటర్లకు జ్ఞాపికలను అందజేశారు. వెంకటేశ్ తన హిట్ చిత్రం ‘నువ్వు నాకు నచ్చావ్’లోని ‘దేవుడా ఓ మంచి దేవుడా’ డైలాగ్‌తో ఉన్న సన్నివేశాన్ని తన కెరీర్‌కు ముడిపెట్టి మాట్లాడుతూ కాస్త భావోద్వేగానికి గురయ్యారు.
ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు ఎలా చెప్పాలో తెలియడం లేదని వెంకటేశ్ అన్నారు. ఇదే క్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గతంలో చెప్పిన మాటలను వెంకటేశ్ గుర్తు చేసుకున్నారు. ప్రేక్షకులకు వినోదాత్మక చిత్రాలు అందించాలని అనుకుంటాను తప్ప రికార్డులు తాను పట్టించుకోనని వెంకటేశ్ పేర్కొన్నారు.