Friday, April 18, 2025

తగిన ఏర్పాట్లు చేయకపోవడంతోనే తొక్కిసలాట

హత్రాస్‌ ‌బాధితులకు లోక్‌ ‌పభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌పరామర్శ

మతపరమైన కార్యక్రమానికి పోలీసులు తగిన ఏర్పాట్లు చేయలేదని, ఇదే తొక్కిసలాటకు దారితీసిందని మృతుల బంధువులు చెప్పారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్‌ ‌గాందీ తెలిపారు. శుక్రవారం హత్రాస్‌ను సందర్శించి, తొక్కిసలాటలో మృతుల కుటుంబాలను రాహుల్‌ ‌పరామర్శించారు. ఈ విషాదాన్ని రాజకీయం చేయదలచుకోలేదని అన్నారు. అయితే మృతుల కుటుంబాలకు మరింత పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.

ఇది బాధాకరమైన సంఘటన అని, చాలా మంది మరణించారని, తాను ఈ విషయాన్ని రాజకీయ కోణం నుండి చెప్పదలచుకోలేదని, కానీ పరిపాలనలో లోపాలు ఉన్నాయని అన్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు పేదవారు కాబట్టి గరిష్ట పరిహారం ఇవ్వాలని, నష్టపరిహారం విషయంలో జాప్యం జరిగితే ఎవరికీ ప్రయోజనం ఉండదని యూపి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని కోరుతున్నానని తెలిపారు. వారు షాక్‌లో ఉన్నారని, తాను వారి పరిస్థితిని అర్థం చేసుకోవాలనుకున్నానని రాహుల్‌ ‌గాంధీ సమావేశం అనంతరం తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com