Sunday, September 29, 2024

వయనాడ్ ప్రజలకు రాహూల్ భావోద్వేగ లేఖ

మీరంతా ఎప్పటికీ నా కుటుంబ సభ్యులే-రాహూల్

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలితో పాటు కేరళలోని వయనాడ్‌ ఎంపీ స్థానాల్లో పోటీ చేసి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే కదా. ఈ క్రమంలో వయనాడ్‌ ఎంపీ స్థానాన్ని వదులుకోవాలని రాహూల్ నిర్ణయించారు. దీంతో వయనాడ్ లోక్ సభ స్థానానితి జరగబోయే ఉపఎన్నికలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో వయనాడ్‌ ప్రజలను ఉద్దేశిస్తూ భావోద్వేగమైన లేఖ రాశారు రాహూల్ గాంధీ.

తాను సందిగ్ద పరిస్థితుల్లో ఉన్న టైంలో వయనాడ్‌ ప్రజల ప్రేమాభిమానాలే కాపాడాయని లేఖలో చెప్పుకొచ్చారు రాహూల్ గాంధీ. తాను వయనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానన్న నిర్ణయాన్ని మీడియాకు చెప్పేందుకు చాలా బాధపడినట్టు తెలిపారు. తనకు ఆశ్రయం కల్పించి, ఓ కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారని అన్నారు.

రాహూల్ గాంధీ వయనాడ్ ప్రజలకు రాసిన లేఖలో ఏమన్నారో ఆయన మాటల్లోనే.. డియర్‌ బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ ఆఫ్‌ వయనాడ్‌.. మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నేను నా నిర్ణయాన్ని మీడియా ఎదుట చెప్పేటప్పుడు నా కళ్లల్లో బాధను మీరంతా చూసే ఉంటారు. నేను ఎందుకు బాధపడ్డానో తెలుసా.. మీ మద్దతు కోరుతూ ఐదేళ్ల క్రితం మిమ్మల్ని కలిశాను. అప్పటికి నేను మీకు పెద్దగా పరిచయం లేకపోయినా.. మీరందరు నాపై అభిమానంతో నన్ను నమ్మి ఎంపీగా గెలిపించారు.

నాపై, మా కుటుంబంపై అవధుల్లేని ప్రేమాభిమానాలు కురిపించారు. మీరు ఏ వర్గానికి చెందిన వారైనా, ఏ రాజకీయ పార్టీకి మద్దతిచ్చినా, రోజు రోజుకీ నాపై వేధింపులు ఎక్కువైనప్పుడు మీరంతా నాకు మద్దతుగా నిలిచారు. మీ అనిర్వచనీయమైన ప్రేమే నన్ను రక్షించింది. వరదల సమయంలో ఎదురైన పరిస్థితులను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒక్కో కుటుంబం తమ జీవితాలను కోల్పోయినా, యావదాస్తులు వరదల్లో కొట్టుకుపోయినా మీలో ఒక్కరు కూడా హుందాతనాన్ని కోల్పోలేదు.

ఇప్పుడు ఎన్నికల్లో మరోసారి నన్ను ఎంపీగా గెలిపించారు. మీ అంతులేని ప్రేమను నేను కలకాలం గుర్తుపెట్టుకుంటాను. లక్షలాది మంది ప్రజల ముందు నా ప్రసంగాలను అనువాదం చేసిన ధైర్యసాహసాలు కలిగిన ధీర యువతుల విశ్వాసాన్ని నేను ఎలా మర్చిపోగలను.. పార్లమెంట్‌లో మీ తరఫును గొంతు వినిపించడం నాకు ఎంతో సంతోషాన్ని, గౌరవాన్ని ఇచ్చిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

వయనాడ్ ను వదిలి వెళ్లాలంటే ఎంతో బాధగా ఉన్నా, వెళ్లక తప్పడం లేదు. మీ అందరి తరఫున పోరాడేందుకు నా సోదరి ప్రియాంక గాంధీ వస్తున్నారు. మీరు ఆమెకు అవకాశం ఇస్తే.. వయనాడ్ ఎంపీగా అద్భుతంగా పని చేస్తారన్న విశ్వాసం నాకుంది. రాయ్‌ బరేలీ లోనూ ఇక్కడిలాగే అభిమానం, ప్రేమ చూపించే ప్రజలు ఉన్నారు. మీకూ, రాయబరేలి ప్రజలకు నేను ఒకే మాట ఇస్తున్నా.. దేశంలో ప్రబలుతున్న విద్వేషం, హింసపై పోరాడి వాటిని ఓడిస్తాను. మీరంతా నా కుటుంబ సభ్యులే. మీ అందరికీ ఎప్పుడూ అండగా ఉంటాను ధన్యవాదాలు.. అంటూ సుధీర్గంగా వయనాడ్ ప్రజలకు భావోద్వేగమైన లేఖ రాశారు రాహూల్ గాంధీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular