Wednesday, April 2, 2025

మేం కూడా వస్తున్నాం… రాష్ట్రానికి కాంగ్రెస్​ అగ్రనేతలు

  • 5, 9న రాహుల్ గాంధీ ​పర్యటన
  • 6,7 తేదిల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న ప్రియాంక

టీఎస్​, న్యూస్​: పార్లమెంట్​ ఎన్నికల ప్రచారంలో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. కాంగ్రెస్​ అభ్యర్థులకు మద్దతుగా ఇప్పటికే నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తోన్న సీఎం రేవంత్​ రెడ్డి.. బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీల తీరుపై తనదైన శైలీలో విరుచుకుపడుతోన్నారు. ఇప్పుడు ఆయనతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. ఈ నెల 5న తెలంగాణకు రానున్న రాహుల్​ గాంధీ.. ఉదయం 11గంటలకు నిర్మల్ బహిరంగ సభలో,సాయంత్రం గద్వాల్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గోనున్నారు. 9న ఉదయం 11గంటలకు కరీంనగర్ లో జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొగనున్న రాహుల్​.. సాయంత్రం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని కాంగ్రెస్​ వర్గాలు తెలిపాయి.

అలాగే ఈ నెల 6, 7 తేదీల్లో పాల్గొననున్న ప్రియాంక గాంధీ వివిధ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 6న ఉదయం 11గంటలకు ఎల్లారెడ్డిలో జరగనున్న బహిరంగ సభలో,సాయంత్రం 3గంటలకు తాండూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రోడ్ షోలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. 7న ఉదయం నర్సాపూర్ లో జరిగే బహిరంగ సభలో పాల్గోనున్న ప్రియాంక గాంధీ.. సాయంత్రం కూకట్ పల్లిలో జరగనున్న బహిరంగ సభలోనూ పాల్గొంటారు. అయితే ఈ సభలను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్​ కసరత్తు చేస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com