Thursday, December 26, 2024

మ‌ణిపూర్‌లో ఏ సంఘ‌ట‌న రాహుల్‌ని ఎక్కువ‌గా క‌లిచివేసింది?

మోడిపై విరుచుకు ప‌డ్డ రాహుల్‌గాంధీ

మణిపూర్ ప్రజలను రాష్ట్రాన్ని బీజేపీ వేరు చేస్తూ చూస్తోంద‌ని రాహుల్ గాంధీ మండిప‌డ్డారు. ఆయ‌న లోక్ స‌భలో మ‌ధ్యాహ్నం ప‌న్నెండు గంట‌ల‌కు ఆవేద‌న‌తో ప్ర‌సంగించారు. ఆయ‌న మాట్లాడుతూ.. మణిపూర్‌ని హత్య చేసి తమాషా చూస్తున్నారని అధికార‌ప‌క్షంపై విరుచుకుప‌డ్డారు. సభలో అధికార, విపక్ష సభ్యుల అరుపులతో స్పీకర్ పలు మార్లు సభ్యులను శాంతింపజేశారు. రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. తాను మణిపూర్ వెళ్లి సంఘటనల గురించి తెలుసుకునే క్ర‌మంలో.. పునరావాస కేంద్రంలో త‌ల‌దాచుకున్న‌ ఒక మహిళ.. తన కళ్ళ ముందే తన కొడుకును కాల్చి చంపారని తెలిపిన సంఘటన కలిచివేసిందన్నారు. మోడీ మణిపూర్ రాష్ట్రాన్ని భారతదేశంలో భాగంగా చూడటం లేద‌ని విమ‌ర్శించారు. అక్కడి ప్రజలను భారత ప్రజలుగా చూడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో భారతమాతకు బీజేపీ జై కొడుతూనే.. భరతమాతను మణిపూర్‌లో హత్య చేసార‌ని దుయ్య‌బ‌ట్టారు. నా కన్న తల్లి ఇక్కడ కూచున్నది.. నా భారతమాతను అక్కడ మణిపూర్లో చంపేశారని ఆవేద‌న వెలిబుచ్చారు. మోడీ ప్రభత్వాన్ని.. మీరు దేశ భక్తులు కాదు, దేశ ద్రోహులని అధికార సభ్యుల అక్షేపణల మధ్యన తీవ్ర ఆరోపణలు చేశారు. భారత సేన‌లను ఉపయోగించి మణిపూర్లో గందరగోళాన్ని ఆపేయవచ్చు కానీ చేయ‌ట్లేద‌ని విమ‌ర్శించారు. మోడీ మణిపూర్ రాష్ట్రాన్ని అణిచివేస్తున్నారంటు రావణుడు మేఘనాథ్‌, కుంభకర్ణుని మాటలు విన్నట్టు.. మోడీ అమీత్ షా, అదాని మాటల్ని మాత్రమే వింటున్నారని సభలో అరుపుల మధ్యన ఆయ‌న ప్రసంగాన్ని ముగించారు.

ఇంత‌వ‌ర‌కేం జ‌రిగింది?
మణీపూర్ లో మూడు నెల‌లుగా జాతిపరమైన గొడవలు జరుగుతూ వేలమంది నిరాశ్రాయుల‌య్యారు. 200 వందలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. మహిళలను మాన‌భంగం చేస్తూ నగ్నంగా ఊరేగించిన సందర్భాలు దేశ ప్రజలను, పార్టీలను నివ్వెరపరిచాయి. అక్కడి ప్రభుత్వం, పోలీసులు అలసత్వం చూపిస్తున్నారన్న విషయంలో ప్రధాని మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా.. అక్కడి గొడవలకు కారణమైన వారిని కట్టడి చేయడంలో, కేసులు పెట్టడంలో ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించార‌ని కాంగ్రెస్, విపక్షాలు విరుచుకుప‌డుతున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాలు ఇండియా పేరున కూటమి గా ఏర్పడ్డారు. బీజేపీని ఉమ్మడి శత్రువుగా భావించి రానున్న‌ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గద్దె దించాలని కంకణం కట్టుకున్నారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్రమంలో లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్.. మోడీ ప్రభుత్వంపైన ఆగస్టు 8 న లోకసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. బీజేపీ తరపున మొదటగా జార్ఖండ్, గొడ్డ ఎంపీ నిశికాంత్ దూబే మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో ఉన్న బీజేడీ, ఆర్జేడీ, ఎస్పీ పార్టీ నేతలపై ఎవరు కేసులు పెట్టారో అందరికీ తెలుస‌ని దుయ్యబ‌ట్టారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com